ప్రపంచం మొత్తం ఒకవైపు పాక్ మాత్రం మరో వైపు అన్న చందంగా ఉంది.  భారత దేశంతో అన్ని దేశాలు స్నేహ హస్తాన్ని చాపుతుంటే.. పాక్ మాత్రం శత్రువుగానే చూస్తుంది. గత కొంత కాలంగా భారత దేశంలో కీలక సమస్యగా మారిన కాశ్మీర్ వివాదానికి మోడీ ప్రభుత్వం చెక్ పెట్టింది.  కొంత కాలంగా అక్కడ కొనసాగుతున్న సమస్య జమ్మూకశ్మీర్ కు ఆర్టికల్‌ 370 సహా పలు అధికారాలను భారత ప్రభుత్వం రద్దు చేయడంపై పాక్‌ తీవ్రంగా స్పందించింది. భారత్‌తో దౌత్య సంబంధాలు తగ్గించుకోవాలని నిర్ణయించింది. 

ఇందుకు నిరసనగా  భారత్ తో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు పాకిస్థాన్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పాక్ లో భారత రాయబారి అజయ్ బిసారియాను దేశం నుంచి బహిష్కరించింది.  లాహోర్-ఢిల్లీ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ సర్వీసులను పాక్ రద్దు చేసింది. వాఘౌ సరిహద్దులో రైలుని నిలిపేసి ప్రయాణికులను దించేసింది పాక్. అట్టారి రైల్వే స్టేషన్ నుంచి పాక్ కు సంఝౌతా ఇంజిన్ వెళ్లిపోయింది. ప్రస్తుతం ప్రదర్శిస్తున్న బాలీవుడ్ సినిమాలను వెంటనే నిలిపివేయాలనీ, అలాగే కొత్త సినిమాలను కూడా తాము అనుమతించబోమని పాక్ ప్రధాని ప్రత్యేక సహాయకుడు డా. ఫిరదౌస్ అషిక్ అవాన్ చెప్పారు. 

గతంలో కూడా పలు మార్లు భారత సినిమాలపై నిషాదాలు విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు పాక్ తీసుకునే ఇలాంటి దుందుడుకు నిర్ణయాలతో భారత్ కు ఎలాంటి నష్టం లేదని,పాకిస్తానే తీవ్రంగా నష్టపోతేందని విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  కాకపోతే అక్కడ 21 పాకిస్థానీ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఒక్కో బాలీవుడ్ సినిమా పాక్ లో రూ.3 నుంచి 4 కోట్ల వరకూ అర్జిస్తోంది. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా రూ.37 కోట్ల కలెక్షన్ తో పాకిస్థాన్ లో టాప్ గా నిలిచింది. తాజాగా పాక్ నిర్ణయంపై భారత ప్రభుత్వం తీవ్రంగానే పరిగనిస్తుంది.  ఇక ఆర్టికల్ 370 రద్దు విషయం పై ఇంకా ఎంత రగడ జరగనుందో తెలియాల్సి ఉంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: