అమెజాన్ బ్రాండ్ కు ఈ కామర్స్ రంగంలో ప్రపంచమంతా మంచి పేరుంది.అలాంటి అమెజాన్ సంస్థ డిజిటల్ మార్కెట్ లోకి అమెజాన్ ప్రైమ్ తో అడుగుపెట్టింది.అన్ని డిజిటల్ మార్కెటింగ్ సంస్థలు సిరీస్ లు చేస్తూ తమ వ్యువర్స్ ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంటే అమెజాన్ మాత్రం దానికి భిన్నంగా థియేటర్ మార్కెట్ పై కన్నేసింది.అందుకే కొత్త సినిమాలను రిలీజ్ అయిన నెల లోపు వారి యాప్ లో రిలీజ్ చేస్తుంది.దానిని గ్రహించిన తెలుగు చిత్రసీమ మా ద్వారా రిలీజ్ అయిన చిత్రాన్ని రెండు నెలల తర్వాతే వారి యాప్ లో ఉంచాలని నియమాన్ని విధించింది.

మా అసోసియేషన్ విధించిన నియమం అనుగుణంగానే అమెజాన్ తమ యాప్ లో రెండు నెలల తర్వాత తెలుగు సినిమాలను వీక్షకులు చూసేలా విడుదల చేస్తుంది.చిన్న సినిమాలు గా వచ్చి బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టిన ' ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ' ,' బ్రోచేవారెవరురా ' చిత్రాలను ఆగస్ట్ 7వ తేదీన 9 తేదీన అమెజాన్ యాప్ లో విడుదల చేస్తున్నట్లు గత కొద్దిరోజుల నుండి అమెజాన్ అనుబంధ సంస్థలు సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి.8 వ తేదీ అయిన రెండు చిత్రాలలో ఒక్కటి కూడా అమెజాన్ లో రిలీజ్ అవ్వకపోవడంతో నెటిజన్లు అమెజాన్ తమని మోసం చేసిందంటూ ఇచ్చిన మాట తప్పిందంటు పోస్టులు పెడుతూ ట్రాలింగ్ చేస్తున్నారు.

ఈ కామర్స్ రంగంలో అతి పెద్ద సంస్థ అయిన అమెజాన్ ఇలా మాట తప్పడం దానికి తగిన వివరణ ఇవ్వకపోవడంతో టెక్నికల్ ప్రాబ్లం వల్ల చిత్ర రిలీజ్ ఆలస్యం అవుతుందని కూడా లేకుండా ఆ చిత్రాన్ని ఎవరైనా ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అని అమెజాన్ ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.కొందరు అమెజాన్ పై జాలి చూపకుండా దానిని సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రాలింగ్ చేస్తున్నారు.పెద్ద హీరోలను,రాజకీయ నాయకులను కూడా వదలని సోషల్ మీడియా ఇప్పుడు అమెజాన్ కూడా వడలేదనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: