ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బంపర్ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చి రెండోసారి ప్రధాని అయ్యాక మోడీ పార్లమెంటులో ఆర్టికల్ 370 ని రద్దు చేసి తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు. చరిత్రాత్మకమైన ఈ నిర్ణయంతో చాలామంది మోడీ నాయకత్వంపై హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలలో టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలు సత్తా చాటుతూ రికార్డులు సృష్టిస్తున్న క్రమంలో చాలామంది తెలుగు సినిమాల గురించి ఉత్తరాది లో ఉన్నవారు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమా సత్తా ఏంటో నిరూపించడం తో అప్పట్లో ప్రధాని మోడీ బాహుబలి టీమ్ ని అభినందించారు.


ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత యావ జాతినుద్దేశించి మోడీ చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలే ఈ బిల్లు పార్లమెంటులో పాస్ అవడం తో పూర్తిస్థాయిలో కశ్మీర్  ఇండియాలో అంతర్భాగం అయింది. ఇకపై కశ్మీర్, లడక్ ప్రాంతాల పూర్తి అధికారం కేంద్రం చేతుల్లో ఉండనుంది.


ఈ విషయం గురించి మోడీ ప్రసంగిస్తూ.. ఇకపై కశ్మీర్ ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం అని తెలిపారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ప్రస్తావన తీసుకువచ్చారు. తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల గురించి మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాన చిత్ర పరిశ్రమలైన ఈ మూడు ఇకపై కశ్మీర్ కు షూటింగ్స్ కోసం రావాలని మోడీ కోరారు. కాశ్మీరులో ఉన్న ప్రకృతి చాలామందిని పర్యాటకుల్నిఆకర్షిస్తుందని కానీ గతంలో అక్కడ ఉగ్రవాదం ఇతర ప్రమాదకరమైన పరిస్థితుల వల్ల పర్యాటక రంగం అంతగా అభివృద్ధి చెందలేదని అయితే ఇప్పుడు నందే కాశ్మీర్లో అభివృద్ధి జరుగుతుందని కొత్త శకం కాశ్మీర్లో ప్రారంభమైంది మోడీ పేర్కొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: