టాలెంటెడ్ హీరోయిన్  ఐశ్వర్య రాజేష్ మన తెలుగు అమ్మాయే అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు తమి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య మొదటిసారి డైరెక్ట్ గా చేస్తోన్న సినిమా  ‘కౌసల్య కృష్ణమూర్తి..ది క్రికెటర్‌’.  కాగా లేడీ క్రికెటర్‌ కథాంశంతో వస్తున్న ఈ విభిన్న చిత్రం విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన ఈ చిత్రం అన్నివర్గాల ఆడియన్స్‌ని అలరిస్తుందట. క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్‌ చేస్తున్నారు. ఇక తమిళ హీరో శివకార్తికేయన్‌ ఒక స్పెషల్‌ రోల్‌ చేయడం ఈ చిత్రానికి హైలైట్‌. 

ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం చాల ఎమోషనల్ గా ఉంటాయట. అలాగే క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌ ఈ సినిమాలో ఉన్న నావెల్టీ.  ఫిమేల్‌ క్రికెటర్‌గా ఐశ్వర్యా రాజేష్‌ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది అనే డ్రామా కూడా బాగా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట.  ఇక ఈ సినిమా పట్ల చాలా ఇనెట్రస్టింగ్ గా ఉన్నానని తెలుగు సినిమాలో నటిస్తోన్నందుకు    ఐశ్వర్య రాజేష్ చాలా అనందం వ్యక్తపరుస్తోంది.  క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్‌ చేయడం జరిగిందట. 

ఇక సినిమాలోని 'ముద్దాబంతి పూవు ఇలా పైట వేసెనా.. ముద్దూ ముద్దూ చూపులతో గుండె కోసెనా...' పాట ప్రస్తుతం ట్రెండింగ్‌ లోకి కూడా వెళ్ళింది. ఇప్పటికి ఈ పాటకి మంచి ఆదరణ లభిస్తోంది. యాజిన్‌ నిజార్‌ పాడిన ఈ పాటను రేడియో మిర్చిలో విడుదల చేశారు. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ సాంగ్ కు దిబు నినన్‌ థామస్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.   

ఇక నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.  ఈ నెల 23న చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: