మహేష్ బాబు సూపర్ స్టార్. టాలీవుడ్ అందగాడు. మహేష్ స్టామినా ఏంటో అయన   చిత్రాలు చెబుతాయి.  మీడియాతో పెద్దగా మాట్లాడని ఈ హీరో సినిమాలు మాత్రం ఎన్నో వూసులు చెబుతాయి. మహెష్ తాజా చిత్రం మహర్షి రికార్డుల  వరద పారిస్తే గత ఏడాది రిలీజ్ అయిన భరత్ అను నేను సెన్సేషనల్ హిట్ కొట్టింది. కొత్త కధలను ఇష్టపడే మహేష్ హిట్లు, ఫ్లాప్స్ కి వెరవని నేచర్. తండ్రి క్రిష్ణ లాగానే సాహసి అని చెప్పాలి. మహేష్ దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆగస్ట్ నెలలో 9వ తేదీన  1975లో  పుట్టాడు.


ఆయన తొలి చిత్రం బాలనటుడుగా తొమ్మిదేళ్ళ వయసులో వచ్చిన పోరాటం. నాటి నుంచి బాలనటుడుగా ఎన్నో చిత్రాలో మెరిసి మురిపించిన మహేష్ 1998లో రాజకుమారుడు మూవీ ద్వారా సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది సూపర్ డూపర్ హిట్. అయితే ఆ తరువాత వచ్చిన కొన్ని చిత్రాలు నిరాశ పరచడంతో రూట్ మార్చిన మహేష్ ఒక్కడుగా నిలిచారు.


ఆ తరువాత పోకిరిగా విశ్వరూపం ప్రదర్శించి టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేశాడు. అతడు అంటూ అందమైన పలకరింపులా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన మహేష్ దూకుడులో పోలీస్ అంటూ తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ చూపించాడు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో వెంకటేష్ తో కలసి స్క్రీన్ చేసుకున్న మహేష్ శ్రీమంతుడు తో దత్తత మీద కొత్త కాన్సెప్ట్ తో అలరించాడు. 


తన మూవీస్ ద్వారా ఏదో ఒక సందేశం ఇస్తూ వస్తున్న మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ మూవీలో మేజర్ గా టిపికల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇదే వరసలో బాక్ టు   బాక్ మరిన్ని మూవీస్ ని లైన్లో పెట్టిన మహేష్ పరశురాం డైరెక్షన్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.


ఇక వచ్చే ఏడాది చరణ్, తారక్ కాంబో రిలీజ్ అవుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత రాజమౌళీ మహేష్  మూవీ స్టార్ట్ అవుతుందని టాక్. ఈ మూవీ కోసం ఎంతో మంది కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ పుట్టిన రోజుతో మహేష్ మరిన్ని విజయాలను చూసేందుకు సరికొత్తగా బాటలు వేసుకుంటున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: