ఆగస్టు నెల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు వరుసగా విడుదల అవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈనెల నాగార్జున నటించిన మన్మధుడు2 సినిమా ఆ తర్వాత భారీ బడ్జెట్ సినిమా సాహో సినిమా తర్వాత ఇలా వరుసగా చాలా పెద్ద పెద్ద సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విడుదల అవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా సైరా సినిమా కూడా అక్టోబర్ లో విడుదల కాబోతుంది. ఇలా వరుసగా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్న క్రమంలో నాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా సెప్టెంబర్ లో విడుదల చేయాలని సినిమా యూనిట్ ఆలోచిస్తుంది.


ఇటువంటి నేపథ్యంలో నాని కి పోటిగా మెగా కాంపౌండ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'వాల్మీకి' రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. అయితే రిలీజ్ విషయంలో రెండు సినిమాలకు సంబంధించిన వారు మాట్లాడుకున్నా గాని మాటలు కుదరకపోవడంతో అనుకున్న డేట్ కి విడుదల చేయడానికి రెండు సినిమాలకు చెందినవారు ఫిక్స్ అవడంతో ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నానికి మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ కి పోటీ చాలా గట్టిగా ఉంటుందని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.


నాని వ్యవహరిస్తున్న దూకుడు పై మెగా అభిమానులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమా టైటిల్ పెట్టుకోవడంతో తీవ్రస్థాయిలో నాని పై సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఫైర్ అయ్యారు.. ఇటువంటి తరుణంలో నాచురల్ స్టార్ నాని మెగా కాంపౌండ్ హీరోతో బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగడంతో ఈ రెండు సినిమాల గురించి వాల్మీకి - గ్యాంగ్ లీడర్ గురించి ఇండస్ట్రీకి చెందిన వారు తెగ చర్చించుకుంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: