యాంకర్ గా సూపర్ ఫాంలో ఉన్న అనసూయ మంచి పాత్ర వస్తే సినిమాల్లో కూడా నటిస్తుంది. రంగస్థలం రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ కథనం అంటూ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనసూయ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వస్తుంది. ఓ పక్క కింగ్ నాగార్జున మన్మథుడు 2 రిలీజ్ అవుతుండగా ఆ సినిమాకు పోటీగా అనసూయ కథనం వస్తుంది.


ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ గురించి ప్రస్థావించింది అనసూయ. బిగ్ బాస్ సీజన్ 3 ఛాన్స్ తనకు వచ్చిందని కాని తను అన్ని రోజులు ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండలేనని మొదటి మీటింగ్ లోనే చెప్పేశానని అన్నారు అనసూయ. ఏదైనా షూటింగ్ పని మీద రెండు రోజులు వెళ్తేనే రోజులో మూడు నాలుగు సార్లు వీడియో కాల్ చేసుకుంటామని అలాంటిది 100 రోజులు బిగ్ బాస్ హౌజ్ లో ఉండటం కష్టమని చెప్పుకొచ్చింది అనసూయ.


ప్రస్తుతం ఈ సీజన్ లో ఉన్న వారంతా తనకు మంచి స్నేహితులని.. వాళ్లందరిని చూసి తనకు వెళ్లాలనిపిస్తుంది కాని ఫ్యామిలీని విడిచి వెళ్లడం కుదరదు అందుకే బిగ్ బాస్ కు నో ఛాన్స్ అన్నది అనసూయ. బిగ్ బాస్ సీజన్ 2లో అనసూయ ఒక్కరోజు గెస్ట్ గా వచ్చింది. ఇంటి సభ్యులకు ఉత్సాహాన్ని నింపేందుకు ప్రదీప్, అనసూయ ఇద్దరు సెకండ్ సీజన్ లో వచ్చారు.  


అయితే ఈ సీజన్ లో కూడా బుల్లితెర మీద ఫేమస్ ఫిగర్స్ కొంతమందిని హౌజ్ లోకి గెస్ట్ గా పంపిస్తారని తెలుస్తుంది. జబర్దస్త్ షో నుండి సుడిగాలి సుధీర్ బిగ్ బాస్ హౌజ్ కి వస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. అదే జరిగితే బిగ్ బాస్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సీజన్ కంటెస్టంట్స్ లిస్ట్ లో సుధీర్, రష్మిలు ఉన్నట్టుగా మొదట్లో వార్తలు వచ్చాయి. తీరా చూస్తే ఆ ఇద్దర్లో ఎవరు బిగ్ బాస్ లో కనబడలేదు.   



మరింత సమాచారం తెలుసుకోండి: