సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమా రంగానికే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సూపర్ స్టార్ గా మారిపోయాడా అని అనిపించే ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ రోజు మహేష్ 44వ పుట్టినరోజు కావడంతో నిన్న రాత్రి నుండి మహేష్ ను అభినందిస్తూ అతడి అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి తార స్థాయిలో ఉంది. 

‘హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు’ అంటూ ఒక ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారడంతో మహేష్ ను అభినందిస్తూ 1.97 మిలియన్ ట్విట్స్ వచ్చాయి. అయితే నిన్నరాత్రి ప్రధానమంత్రి మోడీ ఛానల్స్ ద్వారా కాశ్మీర్ సమస్య పై చేసిన కీలక ఉపన్యాసానికి మోడీని అభినందిస్తూ 9800 ట్విట్స్ వచ్చాయి. 

దీనితో ప్రధాని మోడీ ఉపన్యాసం కంటే మహేష్ పుట్టినరోజు ట్రెండింగ్ గా మారడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. దీనికితోడు మహేష్ ఇప్పటి వరకు నటించిన 25 సినిమాలలోని మహేష్ గెటప్స్ ను హైలెట్ చేస్తూ రకరకాల పోస్టర్లు నిన్న రాత్రి నుండి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. 

ఎప్పుడు లేని విధంగా మహేష్ అభిమానులు ఈసారి సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడితో మహేష్ సోషల్ మీడియా ట్రెండింగ్ గా మారిపోయాడు. దీనికితోడు మహేష్ పిఆర్ టీమ్ కూడ ఈ విషయమై దృష్టి పెట్టడంతో ఈ ట్రెండింగ్ ఇలా పతాక స్థాయిలో కొనసాగుతోంది. మహేష్ పుట్టినరోజునాడు జరుగుతున్న ఈ హంగామా చూస్తుంటే సంక్రాంతికి రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ పై ఎలాంటి భారీ అంచనాలు ఉన్నాయో అర్ధం అవుతుంది. అనేకమంది టాలీవుడ్ సెలెబ్రెటీలు మహేష్ కు అభినందనలు తెలుపుతున్న పరిస్థితులలో ఈ రోజు ఇండియన్ సూపర్ స్టార్ గా మహేష్ మారిపోవడం అతడి అభిమానులకు జోష్ ను ఇచ్చే సంఘటన..  


మరింత సమాచారం తెలుసుకోండి: