కింగ్ నాగార్జున హీరోగా చిలసౌ ఫేం రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా మన్మథుడు 2. ఫ్రెంచ్ మూవీ కథతో తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్స్ నుండి ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది. ఫస్ట్ టాక్ తోనే మన్మథుడు ఢీలా పడ్డాడని తెలుస్తుంది.


కథ, కథనాలు ఏవి ప్రేక్షకులను అలరించేలా లేవంటూ ప్రీమియర్స్ షో నుండి వస్తున్న టాక్. నాగార్జున తన వరకు బాగానే చేసినా దర్శకుడు రాహుల్ రవింద్రన్ సినిమాను సరిగా డీల్ చేయలేకపోయాడని అంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ అందాలు సినిమాకు ప్లస్సే కాని సినిమాను కాపాడేందుకు అది సరిపోలేదని తెలుస్తుంది.


ఇక కరెక్ట్ గా చెప్పుకునే మన్మథుడు టైటిల్ ను వాడి ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు తప్ప సినిమాలో అసలు మ్యాటర్ లేదన్నది ఓపెన్ టాక్. మరి తెలుగు రాష్ట్రాల్లో షో పడ్డాక ఈ టాక్ లో ఏదైనా చేంజ్ వచ్చే అవకాశం ఉందోమో చూడాలి. నాగార్జున మాత్రం సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పుకొచ్చారు. సినిమాలో అడల్ట్ డైలాగ్స్ కాస్త ఎక్కువే అయ్యాయని అంటున్నారు.  


ఏది ఏమైనా సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా 60 ఏళ్ల వయసు దగ్గర పడుతున్నా ఇంకా లవ్ స్టోరీస్ చేస్తున్న నాగార్జునని మెచ్చుకోవాల్సిందే. అయితే ఒక్కోసారి తన ప్రయత్నాలు బెడిసి కొడతాయని తెలిసిందే. మన్మథుడు 2 కూడా అలాంటి ప్రయత్నమే అంటున్నారు. సినిమా ఆశించిన స్థాయిలో లేదని.. కామెడీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదని ప్రీమియర్ షో నుండి వచ్చిన టాక్. మరి ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది ఈరోజు సాయంత్రం వరకు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: