‘రన్ రాజ రన్’ మూవీతో దర్శకుడు సుజిత్ ఇండస్ట్రీకి పరిచయం కావడమే కాకుండా ఆమూవీ సక్సస్స్ తో ఒకేసారి సుజిత్ కు అనేక అవకాశలు వచ్చాయి. అయితే సుజిత్ మాత్రం తన తదుపరి సినిమాను ప్రభాస్ తో మాత్రమే తీయాలి అని పట్టుదల పట్టడంతో ప్రభాస్ డేట్స్ కోసం రెండు సంవత్సరాలు ఎదురు చూడవలసి వలసి వచ్చింది. చివరకు ఎలాగో అలాగ ప్రభాస్ ను మెప్పించి ‘సాహో’ ని మొదలుపెడితే మొదట్లో 70 కోట్ల సినిమాగా మొదలు అయిన ‘సాహో’ 25౦ కోట్ల సినిమాగా మారి ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ఇలాంటి పరిస్థితులలో మరో మూడు వారలలో విడుదలకాబోతున్న ఈమూవీ స్క్రీన్ ప్లే కు సంబంధించిన ఒక లీక్ ఇప్పుడు బయటకు వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు  ఈ మూవీ స్క్రీన్ ప్లే అంతా ‘రన్ రాజా రన్’ సినిమాను లార్జ్ స్కేల్ లో భారీగా చూస్తే ఎలా వుంటుందో సాహో కూడా అలా ఉంటుందని అంటున్నారు.  మూవీ అంతా ఎత్తులు పై ఎత్తులు రేస్ లు యాక్షన్ ఎపిసోడ్ లమధ్య నడుస్తూ మూవీ చివరకు వచ్చేసరికి ‘సాహో’ మూల కధ కూడా తండ్రి కోసం రివెంజ్ తీర్చుకోవడం లాంటి పాయింట్ తో అల్లబడింది అని అంటున్నారు. 

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈమూవీలో ఎవరు ఊహించని ఒక అట్రాక్షన్ ఉంటుందనివార్తలు వస్తున్నాయి. ‘జెట్ ప్యాక్’ లాంటి పరికరం సాయంతో హీరో అనుకున్నపుడల్లా గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసే సీన్లు ఉంటాయని ఆసీన్స్  అన్నింటిలోను గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ జెట్ ప్యాక్ సీన్లు అందరినీ ఆకట్టుకునేలా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాలకు  సంబంధించిన విషయాలు అన్ని రేపు విడుదల కాబోయే ట్రైలర్ లో చూఛాయగా కనిపిస్తాయని  అని టాక్. 

ప్రస్తుతం ఈవార్తలు ఇలా లీక్ కావడంతో సాహో మూవీ అంతా చిన్న పిల్లలు ఆడుకునే వీడియో  గేమ్ లా మారుతుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈమూవీ పై 300 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయిన పరిస్థితులలో ‘సాహో’ బయ్యర్లు గట్టు ఎక్కాలి అంటే ఈ మూవీ ఖచ్చితంగా 500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి తీరాలి. దీనితో ఈమూవీకి ఈ స్థాయి ఉందా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: