ఏపీని ఇపుడు వూపుతోంది బిగ్ బాస్ సీజన్ 3 రియాల్టీ షో. ఈ షోలో కంటెస్టెంట్లు పెద్దగా పరిచయం ఉన్న వారు తక్కువమందే ఉన్నారు. గ్లామర్ డోస్ కూడా గత సీజన్లతో పోలిసే తగ్గింది. డేరింగ్  అండ్ డేషింగ్ ఫిగర్స్ షోలో ఉంటే ఆ కిక్కే వేరు. అందుకే టాప్ రేంజి యాంకర్లు రష్మి, అనసూయ పేర్లు మొదట వినిపించాయి. ఈ హాట్ హాట్ యాంకరమ్మలు బిగ్ బాస్ ఇంట చేరితే ఆ రచ్చే వేరుగా ఉండేది. కానీ ఎందుకో వారు రాలేదు. అయితే షో నెమ్మదిగా పుంజుకుంటోంది. రేటింగ్ కూడా పెరుగుతోంది. 


ఈ నేపధ్యంలో అనసూయ బిగ్ బాస్ సీజన్ 3 లో తాను పార్టిసిపేట్ చేయకపోవడానికి కారణాలు చెప్పారు. బిగ్ బాస్ షో అంటే తనకూ ఇష్టమేనని, తనకు కంటెసెటెంట్ గా రమ్మని కోరారని  అన్నారు. అయితే తాను షోలోకి వెళ్ళలేన‌ని, తనకు బలహీనత అనుకోండి, వ్యసనం అనుకోండి అది తన ఫ్యామిలీ అంటోంది  అనసూయ. బిగ్ బాస్ లో అన్ని రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉండడం అంటే తన వల్ల కాదని ఆమె కచ్చితంగా చెప్పేసింది.


అందువల్లనే తాను షోలోకి వెళ్ళలేదని ఆమె అంటోంది. అయితే షోలో పార్టిసిపేట్ చేస్తున్న మిగిలిన కంటెస్టెంట్లలో చాలా మంది తనకు తెలుసు అని అనసూయ అంటోంది. వారు అన్ని రోజులు అలా అక్కడ ఉండడం అంటే హాట్సాఫ్ అని పొగిడేసింద్ ఈ హాట్ యాంకర్. ఈ రోజు ఆమె నటించిన కధనం మూవీ రిలీజ్ అవుతోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తానని అసలు అనుకోలేదని, అలా చాన్స్ వచ్చిందని ఆమె చెప్పింది.


తాను ఈ సినిమాను మోసానో, ఈ సినిమా కధే తనని నడిపించిందో మూవీ చూస్తేనే తెలుస్తుందని ఆమె అన్నారు. తనకు పాత్ర ఇంపార్టంట్ అని, తాను చిన్న పాత్ర అయినా చేయడానికి సిధ్ధమేనని కూడా చెబుతోంది. మంచి పాత్ర అయితే ఒక్క సీన్ ఉన్నా కూడా యాక్ట్ చేస్తానని ఆమె అంటోంది. తాను హీరోయిన్ కావాలని, లీడ్ రోల్స్ మాత్రమే చేయాలని ఎక్కడా రూల్ పెట్టుకోలేదని బోల్డ్ గా అనసూయ చెప్పేస్తోంది. సో అనసూయ మరిన్ని మంచి పాత్రలల్లో మెరుస్తుందన్న మాటేగా.



మరింత సమాచారం తెలుసుకోండి: