జాన్వీ కపూర్ దఢక్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.  సినిమా సూపర్ హిట్ అయ్యింది.  మొదటి సినిమానే అయినప్పటికీ బెస్ట్ పెరఫార్మన్ ఇచ్చింది.  ప్రసుత్తం ఈ అమ్మడు కరణ్ జోహార్, కార్గిల్ గర్ల్ సినిమాల్లో చేస్తున్నది.  సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో.. ఫిట్నెస్ విషయంలో కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తుంది ఈ అమ్మడు.  ఎక్కడ ఉన్నా సరే ఈ అమ్మడు తప్పకుండా జిమ్ లో కసరత్తులు చేయాల్సిందే.  



శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాల్సిందే.  ఇక జాన్వీ కపూర్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా ఎక్కువే.  ఫిట్నెస్ కు సంబంధించిన విషయాల కోసం అభిమానులు సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు.  గతంలో జాన్వీ కపూర్ బెల్లి డ్యాన్స్ తో ఇరగదీసింది.  అప్పట్లో ఆమె చేసిన బెల్లి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.  అయితే, ఇప్పుడు మరోసారి బెల్లి డ్యాన్స్ చేసింది.  



తాజాగా బెల్లీ డ్యాన్స్‌ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అందులో జాన్వీ ఎంతో ఉత్సాహంగా ‘అఖ్‌ లడ్‌ జావే’ అనే హిందీ పాటకు డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. ఇంతకు ముందు కూడా జాన్వీ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారమయ్యే ‘డ్యాన్స్‌ దీవానే 2’ రియాలిటీ షోలో భాగంగా సహనటులు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి జాన్వి తన డ్యాన్స్‌ తో అందరినీ ఆకట్టుకున్నారు.



ఆమె చేసిన బెల్లి డ్యాన్స్ ను చూసి బాలీవుడ్ షాక్ అయ్యింది.  వావ్ జాన్వీ వాట్ ఏ డ్యాన్స్ అని మెచ్చుకోవడం మొదలుపెట్టారు.  బెల్లి డ్యాన్స్ చేయడం అంటే మాములు విషయం కాదు.  ఎంతో శ్రమ చేయాలి.  పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి.  శరీరాన్ని దానికోసం సిద్ధం చేయాలి.  చాలా కష్టమైన పని.  అంతటి కష్టంలో కూడా ఆమె చేసిన డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంటోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: