ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన తరువాత మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడిన సంగతి తెలిసిందే.  జాతిని ఉద్దేశించి మాట్లాడిన మోడీ అనేక విషయాలు చెప్పారు.  ఆర్టికల్ 370 రద్దు, పునర్విభజనకు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాలను గురించి మోడీ మాట్లాడారు.  ప్రత్యేకంగా సినిమా  ఇండస్ట్రీ గురించి మోడీ మాట్లాడారు.  బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమా పరిశ్రమలు కాశ్మీర్ లో షూటింగ్ చేయాలనీ, ఫలితంగా జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అన్నారు. 



జమ్మూ కాశ్మీర్ లో షూటింగ్ చేయడం వలన స్థానికంగా ఉండే వాళ్లకు ఉపాధి లభిస్తుంది.  కాశ్మీర్ కు పునర్వైభవం వస్తుంది.  టూరిజం డెవలప్ అవుతుందని మోడీ అన్నారు.  మోడీ ఇచ్చిన పిలుపుతో లడక్ లో సినిమా షూటింగ్ లు చేసేందుకు సినిమాలు రెడీ అవుతున్నాయి.  అందులో మొదటి సినిమా షంషేరా కావడం విశేషం.  



యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు.  చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది.  లడక్ లోని వివిధ ప్రాంతాల్లో సినిమాను షూటింగ్ చేయాలని అనుకుంటున్నారు.  ఒక్క షంషేరా మాత్రమే కాదు, చాలా సినిమాలు జమ్మూ కాశ్మీర్ లడక్ ప్రాంతంలో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.  ఆ సినిమాలు ఏంటి అన్నది త్వరలోనే తెలుస్తోంది.  



ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ లో సినిమాలు ఎక్కువగా షూటింగ్ చేసుకునేవి.  1985 తరువాత ఆ సంఖ్య తగ్గిపోయింది.  ఉగ్రవాదం హెచ్చుమీరడంతో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి.  ఒకానొక దశలో కాశ్మీర్ వెళ్లాలంటేనే భయపడిపోయేవారు.  ఇప్పుడు ఆ స్థితిలేదు.  కాశ్మీర్ లో స్వేచ్ఛగా సినిమా షూటింగ్ లు చేసుకోవచ్చని మోడీ హామీ ఇచ్చారు.  ఆర్టికల్ 370 రద్దు అయ్యింది కాబట్టి ఉగ్రవాదం చాలా వరకు తగ్గిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: