టాలీవుడ్ లెజెండరీ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసుడిగా చిన్నతనంలో నీడ సినిమాతో బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్, ఆ వయసులోనే సూపర్ స్టార్ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నాడు. ఇక బాలనటుడిగా పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన మహేష్ బాబు, చివరిగా బాలచంద్రుడు సినిమా తరువాత సినిమాలకు కొన్నాళ్ళు విరామం ప్రకటించడం జరిగింది. ఆ తరువాత పై చదువులు పూర్తి చేసిన అనంతరం 1999లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యారు. అయితే తొలి సినిమాతోనే తన బాక్సాఫీస్ స్టామినాని చూపించిన మహేష్, అభిమానుల పాలిటి ప్రిన్స్ గా మారారు. అయితే అక్కడినుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు ఆయనను వరించినప్పటికీ, వాటిని పూర్తిస్థాయిలో సక్సెస్ గా మార్చుకోవడంలో మహేష్ కొంత తడబడ్డారు. కెరీర్ పరంగా రెండవ సినిమాలోనే ఒక బిడ్డకు తండ్రిగా నటించిన మహేష్, ఆ తరహా ప్రయోగంతో కూడా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆపై ఆయన భార్య నమ్రత (వివాహం కాక ముందు)తో కలిసి మూడవ సినిమా వంశి మూవీ లో నటించారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఒక ముఖ్యపాత్రలో నటించిన ఆ సినిమా, పెద్దగా సక్సెస్ ని సాధించలేదు. ఆపై కృష్ణవంశీ దర్శకత్వంలో ఆయన నటించిన మురారి సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచి సిల్వర్ జుబిలీ సినిమాగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. అనంతరం ఆయన నటించిన మరొక డిఫరెంట్ జానర్ మూవీ టక్కరిదొంగ, ఓపెనింగ్స్ పరంగా అదరగొట్టినప్పటికీ, 

ఓవర్ ఆల్ గా మాత్రం యావరేజ్ గా నిలిచింది. ఇక ఆ తరువాత శోభన్ దర్శకత్వంలో ఆయన నటించిన బాబీ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి, కెరీర్ పరంగా మహేష్ ని కొంత డైలమాలో పడేసింది. అయితే అదే సమయంలో గుణశేఖర్ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ నటించిన ఒక్కడు సినిమా సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకుని మహేష్ కు కెరీర్ పరంగా అతి పెద్ద హిట్ గా నిలిచింది. అనంతరం తేజతో చేసిన నిజం సినిమా పెద్దగా ఆడనప్పటికీ, ఆ సినిమాలోని సీతారాం పాత్రలో ఒదిగిపోయి నటించిన మహేష్ కు, రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు లభించింది. ఆ తరువాత ఆయన నటించిన నాని, అర్జున్ సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. అయితే అప్పుడే త్రివిక్రమ్ తో ఆయన అతడు సినిమాలో నటించడం జరిగింది. అప్పటి యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్న ఆ సినిమా, సూపర్ హిట్ గా నిలిచి, మహేష్ కెరీర్ కు మంచి బూస్ట్ ని ఇచ్చింది. అదే సమయంలో మహేష్, తన జీవిత భాగస్వామి నమ్రత గారిని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ నటించిన పోకిరి సినిమా రిలీజయి, 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని హిట్ గా నిలిచి, మహేష్ బాబుకు సూపర్ స్టార్ ఇమేజిని తెచ్చిపెట్టింది. ఆపై ఆయన నటించిన సైనికుడు, అతిథి సినిమాలు పెద్దగా ఆడలేదు, అంతేకాక వాటి తరువాత కొంత గ్యాప్ తీసుకుని మరొక్కసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆయన నటించిన ఖలేజా మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మహేష్ కొంత అంతర్మథనంలో పడ్డారు. అదే సమయంలో ఆయన శ్రీను వైట్లతో చేసిన దూకుడు, 

ఆ తరువాత పూరి జగన్నాథ్ తో మరొక్కసారి జతకట్టిన బిజినెస్ మాన్ సినిమాలు, వరుస సూపర్ హిట్స్ గా నిలిచి మహేష్ కు మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి. అనంతరం అయన నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ హిట్ కాగా, వన్ నేనొక్కడినే, ఆగడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ తరువాత కొరటాల దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ సాధించగా, దానితరువాత వచ్చిన బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు ఫ్లాప్స్ ని మూటగట్టుకున్నాయి. అప్పుడే కొంత అలోచించి, మరొక్కసారిఇ కొరటాలకు అవకాశం ఇచ్చి భరత్ అనే నేనులో నటించారు మహేష్, అది సూపర్ డూపర్ హిట్ కొట్టగా, దాని తరువాత తన కెరీర్ 25వ సినిమాగా ఇటీవల వచ్చిన మహర్షితో కెరీర్ లోనే అతిపెద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు మహేష్. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న మహేష్, ఇప్పటివరకు మరొక భాషలో సినిమాలు చేయనప్పటికీ కూడా, నేషనల్ వైడ్ గా నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ పోటీల్లో ఒకసారి రెండవ స్థానం మరొకసారి మూడవ స్థానములో నిలిచి, ప్రస్తుతం ఫరెవర్ డిజైరబుల్ మ్యాన్ గా బాలీవుడ్ ఖాన్స్ తరువాత నాలుగవ స్థానంలో నిలిచారు. కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకొని, దేశవిదేశాల్లో కూడా కోట్లాదిమంది అభిమానులను సంపాదించి, టాలీవుడ్ గర్వపడే హీరో రేంజ్ కి చేరుకున్నారు. ఇక అభిమానుల పాలిటి సూపర్ స్టార్ గా మారిన మహేష్ బాబు, నేడు త 44వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: