అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆరు సినిమాల్లో నటించినా హిట్ కొట్టలేకపోయాడు. స్టార్ హీరోయిన్లు, స్టార్ డైరెక్టర్లు కూడా బెల్లంకొండ శ్రీనివాస్ కు హిట్ ఇవ్వలేకపోయారు. నటించిన సినిమాలేవీ హిట్ కాకపోవటంతో రీమేక్ కథను నమ్ముకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. తమిళంలో హిట్టైన 'రాట్చసన్ ' సినిమా రీమేక్లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించాడు. 
 
గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. 14 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా వీకెండ్ వరకు బాగానే కలెక్షన్లు వసూలు చేసింది. కానీ సోమవారం నుండి రాక్షసుడు సినిమా అనుకున్నంత మేర కలెక్షన్లు సాధించటం లేదు. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా యావరేజ్ ఫలితాన్నే అందుకునే విధంగా ఉంది. 
 
రాక్షసుడు సినిమాకు ప్రధానమైన సమస్య ఏమిటంటే ఈ సినిమా తమిళ సినిమాకు రీమేక్ కావటంతో ప్రేక్షకుడు ఒరిజినల్ రాట్చసన్ సినిమాను ఎప్పుడో చూసేసారు. రాక్షసుడు సినిమాలో పెద్దగా మార్పులేమీ చేయకపోవటం, ఒరిజినల్ సినిమా ఎలా ఉందో ఈ సినిమా మక్కీకి మక్కీ అలానే ఉండటం రాక్షసుడు సినిమాకు సమస్యగా మారింది. మరోవైపు పైరసీ కూడా ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించింది. రిలీజైన ఒక్క రోజులోనే ఈ సినిమా పైరేటెడ్ ప్రింట్ ఆన్ లైన్లోకి రావడంతో పైరసీ ప్రభావం వలన కూడా రాక్షసుడు సినిమాకు కలెక్షన్లు తగ్గాయని తెలుస్తోంది. 
 
ఈ రోజు మన్మథుడు2, కథనం, కురుక్షేత్రం, ఆయోగ్య సినిమాలు విడుదలవుతూ ఉండటం రేపు సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరి మట్ట సినిమా విడుదలవుతూ ఉండటంతో రాక్షసుడు సినిమా కలెక్షన్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఈ వీకెండ్లో రాక్షసుడు సినిమా కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫైనల్ స్టేటస్ ఏంటో చెప్పవచ్చు. 
 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: