మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నాని హీరోగా నటిస్తున్న నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాకు విడుదల తేదీ ఖరారైంది. ముందుగా ఈ సినిమాను ఆగష్ట్ 30 వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ సాహో సినిమా రిలీజ్ డేట్ మారటంతో గ్యాంగ్ లీడర్ సినిమా కూడా రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సాహో సినిమా రిలీజైన రెండు వారాల తరువాత సెప్టెంబర్ 13వ తేదీన నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా విడుదల కాబోతుంది. 
 
ఇప్పటికే విడుదలైన నానీస్ గ్యాంగ్ లీడర్ టీజర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో నాని పెన్సిల్ అనే పాత్రలో రివేంజ్ స్టోరీ రైటర్ గా కనిపించబోతున్నాడు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 13కు మారటంతో ఇప్పుడు వాల్మీకి సినిమా ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తుంది. 
 
వాల్మీకి సినిమాను ముందుగా సెప్టెంబర్ 6 వ తేదీన విడుదల చేద్దామనుకున్నారు నిర్మాతలు. కానీ సాహో రిలీజ్ డేట్ మారటంతో సెప్టెంబర్ 13వ తేదీకి వాయిదా వేసారు.నిజానికి గ్యాంగ్ లీడర్, వాల్మీకి సినిమాల్లో ఏదో ఒకటి రిలీజ్ డేట్ మార్చుకోవాలన్నా అక్టోబర్ 2వ తేదీన సైరా సినిమా విడుదలవుతూ ఉండటంతో ఇద్దరు హీరోలు సెప్టెంబర్ 13వ తేదీనే రావాలని ఫిక్స్ అయ్యారు. 
 
రెండు సినిమాలు ఒకేరోజు విడుదలైతే మాత్రం కలెక్షన్ల విషయంలో రెండు సినిమాలు నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు సినిమాలకు ఒకసారి రిలీజ్ డేట్ మారటంతో మరో సారి రిలీజ్ డేట్ మార్చే సాహసం నిర్మాతలు చేయరు. రెండు సినిమాల్లో ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఇంకో సినిమాకు నెగటివ్ టాక్ వస్తే మాత్రం నెగటివ్ టాక్ వచ్చిన సినిమా భారీగా నష్టపోవాల్సి వస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: