మంచు విష్ణు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద కుమారుడు. దాదాపు ఇరవయ్యేళ్ళ క్రితం సినిమా పరిశ్రమకు వచ్చాడు విష్ణు. తండ్రిలాగానే నటనలో మంచి పట్టుంది. కామేడి టైమింగ్ ఉంది. దాంతో కొన్ని హిట్లు కూడా విష్ణు ఖాతాలో ఉన్నాయి. అనేక రకాలైన సినిమాలు చేసిన విష్ణుకు స్టార్ ఇమేజ్ మాత్రం రాకపోవడం కొంత లోటు. అయినా మంచి నటుడని పేరు తెచ్చుకున్నారు.


ఇదిలా ఉండగా  ఈ రొజు వరలక్ష్మి వ్రతం పండుగ వేళ, శ్రావణ శుక్రవారం నాడు విష్ణు ఇంట మరో పండుగ వచ్చింది. ఆయన ముచ్చటగా మూడవమారు తండ్రి అయ్యాడు. విష్ణుకు ఆడపిల్ల పుట్టింది. దాంతో అందరూ విష్ణుని అభినందిస్తున్నారు. మంచి శుభకరమైన రోజున ఆడపిల్ల పుట్టడం అంటే లక్ష్మి ఇంటికి వచ్చినట్లేనని బ్లెస్ చేస్తున్నారు.


ఇప్పటికే విష్ణుకు ఇద్దరు కవల ఆడపిల్లలతో పాటు, ఒక కుమారుడు ఉన్నారు. ఇపుడు మరో ఆడపిల్లతో నలుగురు బిడ్డల తండ్రి అయ్యాడన్నమట. ఇక విష్ణు భార్య విరోనిక  జగన్ కి సోదరి అవుతారు. జగన్ సొంత చిన్నాన్న కూతురు ఆమె. ఓ వైపు మామ జగన్  సీఎం గా ఉంటే పుట్టిన ఈ బిడ్డ అద్రుష్ట జాతకురాలు అంటున్నారు.


ఇదిలా ఉండగా విష్ణు తనకు ఆడపిల్ల పుట్టిందని ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. ఇక విష్ణు తాజా చిత్రం ఓటర్ రిలీజ్ కి సిధ్ధంగా ఉంది. ఆ మూవీ తరువాత కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేయాలని విష్ణు భావిస్తున్నాడు. ప్రస్తుతం కూతురు పుట్టిన ఆనందంతో విష్ణు ఉన్నారు.  మరో సారి తాత అయిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఎంతో ఆనందిస్తున్నారుట.  ఏమైనా మంచు వారింట మంచి వేడుకే జరుగుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: