ఇస్మార్ట్ శంకర్ తో ఇరగదీశాడు రామ్ పోతినేని,   సాధారణం గా ప్రేమ కథలతో ఎక్కువగా అలరించే ఈ హ్యాండ్సమ్ హీరో ఈ సారి మాత్రం పూరీ స్టయిల్ లో మాస్ మసాలా తో రెచ్చిపోయాడు. తెలంగాణ యాస మాట్లాడుతూ యాక్షన్ తో మాయ చేశాడు. 


అయితే సినిమా సూపర్ హిట్ అవడంతో మన హీరో రామ్  రీసెంట్ గా విదేశాలకు వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చాడట. ఒక భారీ సక్సెస్ వస్తే దాని తరువాత ఏ హీరో లైఫ్ లో అయినా చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ రామ్ అలాంటి స్థితి లోనే వున్నాడు. 


కొంత కాలం క్రితం రామ్ కి ఓ తమిళ చిత్రం బాగా నచ్చేసిందట దాన్ని తెలుగు లో రీమేక్ చేయాలని భావించిన అతను తన పెదనాన్న నిర్మాత స్రవంతి రవి కిషోర్ కి రైట్స్ కోరమని కూడా చెప్పాడట. వెంటనే రైట్స్ లభించాయి ఇంతకీ రామ్ కి నచ్చిన  ఆ తమిళ సినిమా ఏంటంటే అరుణ్ విజయ్ స్టారర్ 'తడం'.   తమిళం లో మంచి స్పందన సాధించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తడం. 


అయితే కిషోర్ తిరుమల దర్శకత్వం లో దీన్ని తెలుగులోకి రీమేక్ చేయాలనుకున్న రామ్ ఇప్పుడు వద్దని భావిస్తున్నాడట కారణం తెలుగు వర్షన్ కోసం చేసిన మార్పులూ చేర్పులూ రామ్ ని సంతృప్తి పరచలేకపోయాడు అందుకే మొత్తాని కి మొత్తం గా రీమేక్ ఆలోచనే పక్కన పెట్టేశాడు. వేరే కథలు వింటూ మరో సినిమా కోసం సిద్ధమవుతున్నాడని ఇండస్ట్రీ లో టాక్ మరో వైపు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ ఇలాంటి సినిమా లు రామ్ తో చేసిన డైరెక్టర్ కిషోర్ కూడా నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో ప్రస్తుతాని కి సస్పెన్స్ గా మారింది. తడం రీమేక్ వర్కవుట్ కాలేదు కాబట్టి వీరిద్దరూ వేర్వేరు గా సినిమా లు చేస్తారో లేదంటే ఏదైనా స్ట్రెయిట్ తెలుగు మూవీ తో మన ముందుకు వస్తారో వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: