బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడిగా అక్షయ్ కుమార్ ఎంతో కాలం నుంచి రాజ్యమేలుతున్నాడు. అయినా ఇతర హీరోల తో నటించడాని కి ఏమాత్రం సంకోచించడు అక్షయ్.  యంగ్ హీరో సినిమా లో సైతం కనిపించటానికే మొహమాటపడడు అక్షయ్ కుమార్.


బాలీవుడ్ లో ముగ్గురు ఖాన్స్ తర్వాత అంతటి స్టార్ డమ్ ఉన్న ఏకైక హీరో అక్షయ్ కుమార్ అని చెప్పాలి. ఖాన్స్ త్రయం తో పోటీ పడుతూ వారితో సమానంగా ఇమేజ్ ను కాపాడుకుంటూ వస్తున్నాడు అక్షయ్.  కోట్లాది రూపాయల పారితోషికం పుచ్చు కున్నా కూడా తన నిర్మాతలా బాగు కోరి మరీ సినిమాల బడ్జెట్ ను నియంత్రిస్తున్నాడు. దేశంలో ఏదైనా విపత్తు సంభవించినపుడు అందరికన్నా ముందు గా ఉండేది మన అక్షయ్.


ఎంత పెద్ద స్టార్ అయినా కూడా అక్షయ్ మాత్రం అందరి తోనూ చాలా కలివిడి గా ఉంటాడు అను అందరూ‌ చెప్తారు. అందుకే పలు మల్టీస్టారర్ లో నటించాడు అక్షయ్. ఇప్పుడు నవతరం నటీనటుల తో నటించడాని కి కూడా ఏమాత్రం సంకోచించటం లేదు. అక్షయ్ కుమార్ స్థాయి లో ఉన్న ఏ హీరో అయినా ఇతరుల చిత్రాల్లో నటించడాని కి ఎంతో ప్రత్యేకమైన కారణాలు ఉంటే కానీ అంగీకరించారు. అక్షయ్ కుమార్ మాత్రం తనకు ఎలాంటి అడ్డంకులు లేవని చెప్పడమే కాకుండా పలు మల్టీస్టారర్ లో నటించి అలరించారు, ఇంకా నటిస్తూనే ఉన్నారు. అసలు మనవాళ్ల తో కలిసి మనం నటించడాని కి ఎందుకు అడ్డంకులు అంటూ ప్రశ్నిస్తున్నాడు. 



అక్షయ్  ఎలాంటి డిమాండ్స్ లేకుండానే కొత్తవారితో నటిస్తున్నాడు అదే అక్షయ్ స్పెషాలిటీ.  పాత్ర నచ్చితే చాలు అక్షయ్ అది ఎంత నిడివి ఉంటుంది,  తనకు ఏమాత్రం పేరు తెస్తుంది అన్న విషయాల గురించి ఆలోచించకుండా నటిస్తాడు.  మొన్నటి కి మొన్న రజనీకాంత్ 2.0 లో ప్రతినాయక పాత్ర లో  అందరినీ మెప్పించాడు .  ఇప్పుడు తనకంటే జూనియర్లు అయిన విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, నిత్యామీనన్, శర్మాన్ జోషి వంటి వారితోనూ మిషన్ మంగళ్యాన్ లో నటిస్తున్నాడు.  ఒక్క సినిమా హిట్టయితేనే బడాయికి పోయే బాబులు అక్షయ్ ని చూసి ఎంతైనా నేర్చుకోవలసి ఉందని సినిమా జనం అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: