మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగష్టు 9న విడుదలైన సినిమాల్లో 1984లో ఛాలెంజ్, 1990లో కొదమసింహం ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఆయా సంవత్సరాల్లో సూపర్ హిట్లుగా నిలిచాయి.



యండమూరి వీరేంద్రనాధ్ నవల ఆధారంగా వచ్చిన ఛాలెంజ్ సినిమా చిరంజీవికి ప్రత్యేకం. ఇందులో యాక్షన్ ఉండదు. బలమైన కథ, స్క్రీన్ ప్లే మాత్రమే ఉంటాయి. చిరంజీవి నటన, కోదండరామిరెడ్డి దర్శకత్వం, ఇళయరాజా మ్యూజిక్ సినిమాను ఓ రేంజ్ హిట్ అవటానికి దోహదపడ్డాయి. క్లైమాక్స్ లో “రామ్మోహన్ రావ్.. నేను గెలిచాను” అనే డైలాగ్ చిరంజీవి చెప్పగానే.. ప్రేక్షకులకు తామే విజయం సాధించినంత ఫీల్ కు గురవుతారంటే అతిశయోక్తి కాదు. అంతటి బలమైన సీన్లెన్నో ఈ సినిమాలో ఉన్నాయి. నిర్మాత కేఎస్ రామారావుకు చిరంజీవితో ఇది రెండో సినిమా. నేటికి ఈ సినిమా రిలీజై 35 ఏళ్లు పూర్తయ్యాయి.

 


మెగాస్టార్ గా చిరంజీవి ప్రభ వెలిగిపోతున్న సమయంలో, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిందే కొదమసింహం. కౌబాయ్ సినిమాల్లో కృష్ణ మోసగాళ్లకు మోసగాడులా చిరంజీవికి కొదమసింహం అలాంటి ల్యాండ్ మార్క్ మూవీ. చిరంజీవి కౌబాయ్ గెటప్, స్టైల్, ఆహార్యం, రాజ్-కోటి మ్యూజిక్, మోహన్ బాబు కామెడీ విలనిజం ఈ సినిమాను 100 రోజుల సినిమాగా మార్చాయి. “స్టార్.. స్టార్.. మెగాస్టార్.. స్టార్” అనే పాట అప్పట్లో సూపర్ హిట్. నటుడు కైకాల సత్యనారాయణ నిర్మాణంలో కె.మురళీమోహన్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితనం హైలైట్. ఈ సినిమా విడుదలై నేటికి 29 ఏళ్లు పూర్తయ్యాయి.

 


ఈ సినిమాలు చిరంజీవితోపాటు ఆయన అభిమానులకు ఎంతో ప్రత్యేకమైనవి. అప్పట్లో చిరంజీవి ని అభిమానించిన చిన్నపిల్లలు తర్వాత రోజుల్లో ఆయనకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా మారిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: