మహేష్ మరియు దిల్ రాజు ల అనుబంధం‌  ఈనాటిది కాదట. మహేష్ బాబు ఇరవై ఐదవ చిత్రం గా 'మహర్షి' తెరకెక్కి విజయకేతనం ఎగురవేసింది,  గతంలో‌ ఉన్న కొన్ని సెంటిమెంట్లను, అపోహలను, చెరిపేసి ఆ సినిమా ఒక కొత్త రికార్డును క్రియేట్ చేసింది. అటువంటి మహర్షి  చిత్ర నిర్మాణం లోనూ దిల్ రాజు పాత్ర ఉంది.


మహేష్ తో దిల్ రాజు తీసింది కేవలం రెండు చిత్రాలు మాత్రమే,  మహేష్ ఇప్పటి దాకా మహేష్ నటించిన చిత్రాల సంఖ్య కేవలం ఇరవై ఐదు వాటిలో దాదాపు ఇరవై రెండు చిత్రాల పంపిణీ లో ప్రత్యక్షం గానూ పరోక్షం గానూ పలుమార్లు పాలుపంచుకున్నారు దిల్ రాజు అందుకే మహేష్ తో దిల్ రాజు తెరకెక్కించింది రెండు చిత్రాలైనా వారి అనుబంధం మాత్రం ఇరవై రెండు సినిమాలది అని సినీ ప్రముఖులు  చెబుతూ ఉంటారు. 


నేడు మహెష్ బాబు పుట్టినరోజు సంధర్బం గా ఒక ఇంటర్యులో మాట్లాడుతూ  "మహేష్ గారితో మురారీ సినిమా అప్పుడు నేను నైజాం డిస్ట్రిబ్యూటర్ ని అప్పుడు మురారీ సక్సెస్ టూర్ తెలంగాణ లో‌ జరిగినప్పుడు ఆయనకి దెగ్గరవడం జరిగింది. అప్పటి నుండి  నేను మహేశ్ గారిని చాల దగ్గర గా చూస్తున్నాను. మురారీ దగ్గర్ నుంచి ఓ మహర్షి వరకు మురారీ ఆయన నాల్గవ చిత్రం అప్పటినుండి ఇప్పతి వరకు 22 సినిమాలు తీశారు. ఇప్పుడు 26 సినిమా తో కూడా ఆయనతో ట్రావెల్ అవుతున్నా" అని దిల్ రాజు చెప్పారు.


మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో హిట్స్ సూపర్ హిట్స్ ఉన్నాయి. వాటన్నింటిని విడుదల చేయడం లో దిల్ రాజు పాత్ర ఉంది ఇక చిత్రాలూ అనేక కేంద్రాల్లో సందడి చేయడం లోనూ దిల్ రాజు పాత్ర ఎంతో ఉందని తెలుస్తోంది.  ఆ చిత్రాల రికార్డులు ఈనాటికీ అభిమానుల మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: