హిందీలో సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమాలో కంగనా రనౌత్ నటించింది. ఈ  బ్లాక్ బస్టర్ సినిమా సౌత్ రీమేక్ హక్కుల్ని మనుకుమరన్ దక్కించుకున్నారు. ఒకేసారి సౌత్ లోని నాలుగు భాషల్లో తెరకెక్కించారు. ఒకేసారి సౌత్ మొత్తం విడుదల చేయాలనేది దర్శక నిర్మాతల ప్లాన్. మిగతా భాషలలో ఏమో కానీ తమిళ వెర్షన్ కు వచ్చేసరికి మాత్రం క్వీన్ రీమేక్ కు చిక్కులు చుట్టుముట్టాయి. క్వీన్ తమిళ రీమేక్ లో కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో నటించింది. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఇప్పుడు సెన్సార్ ఇబ్బందుల్లో పడింది. తాజాగా సినిమా చూసిన సెన్సార్ అధికారులు సినిమాకు ఎ-సర్టిఫికేట్ ఇచ్చారు. అంతేకాదు దాదాపు 25 ఆడియో, వీడియో కట్స్ సూచించారు. 

అయితే ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడే చాలామంది అడల్ట్ కంటెంట్ ఉంటుందని సెన్సార్ కట్స్ గట్టిగానే ఉంటాయని అనుకున్నారు. మిగతా 3 భాషల్లో వచ్చిన టీజర్లు బాగానే ఉన్నప్పటికీ, తమిళ్ లో వచ్చిన టీజర్ మాత్రం వల్గారిటి హెవీ డోస్ లో ఉంది. దాంతో సినిమాలో అలాంటి సన్నివేశాలు, బూతు డైలాగులు చాలానే ఉన్నాయనే విషయం సెన్సార్ నిర్ణయంతో మరోసారి రుజువయింది. 

మిగతా భాషల్లో కూడా అలా బోల్డ్ గా తీసే వెసులుబాటు ఉన్నప్పటికీ హీరోయిన్లు అభ్యంతరం చెప్పడంతో క్లీన్ గానే తెరకెక్కించారు. తెలుగులో తమన్న నటించిన దటీజ్ మహాలక్ష్మీ టీజర్ మన నేటివిటీకి తగ్గట్టుగానే ఉంది. అటు కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ చేసిన వెర్షన్లపై కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఒక్క తమిళంలో మాత్రం కాజల్ నటించిన పారిస్-పారిస్ సినిమా హాట్ గా తెరకెక్కించారు. ఇలాంటి సీన్లలో నటించడానికి కాజల్ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడమే సెన్సార్ కట్స్ కి  ముఖ్య కారణమని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. మరి కాజల్ ఎందుకు ఇంత దిగజారి నటించింది అన్న సందేహాలు చాలామంది మనసులో మెదలుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: