కీర్తి సురేష్, నేడు ఈ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. వాస్తవానికి ఆమె తల్లి తండ్రులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే అయినప్పటికీ, మొదట్లో తన సినిమాల ఎంపిక విషయంలో కాస్త తడబడ్డ కీర్తి, మెల్లగా తనకు వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో అగ్ర నటిగా కొనసాగుతున్నారు. ఇకపోతే నేడు ప్రకటించిన జాతీయ అవార్డుల జాబితాలో కీర్తి సురేష్, ఇటీవల ప్రఖ్యాత దిగ్గజ నటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా నటించిన మహానటి సినిమాలో పోషించిన పాత్రకు గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. దానితో అన్ని భాషల నటుల నుండి ఆమెకు విపరీతమైన ప్రశంశలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. 

వాస్తవానికి కీర్తికి ఈ ఉత్తమ నటి పురస్కారం రావడానికి ఒక ఒక కారణం కూడా ఉందని సినిమా వర్గాల సమాచారం. ముందుగా టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్, మోలీవుడ్, కోలీవుడ్ తో పాటు పలు ఇతర భాష సినిమాల నుండి కూడా ఉత్తమ నటి సెలెక్షన్స్ కోసం ఎంట్రీస్ రాగా, అవార్డుల జ్యూరీ టీమ్ వాటిని సునిశితంగా పరిశీలించిన తరువాతనే చివరికి కీర్తికి ఆ అవార్డును కట్టబెట్టారట. నిజానికి మహానటి సినిమా తెలుగు భాషలోనే కాదు, అటు తమిళ్ లో కూడా సూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. సావిత్రి గారు తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా నటించడంతో ఆ సినిమాకు అంత ప్రాశస్త్యం లభించింది. ఇకపోతే ఈ సినిమాను వీక్షించిన జ్యూరీ సభ్యులకు సినిమాలోని కథ, కథనాలకు మించి, అచ్చంగా సావిత్రి గారిని మెప్పించేలా ఆద్యంతం సినిమా మొత్తం తన అత్యద్భుత నటనతో జీవం పోసిన కీర్తి సురేష్ ఎంతో ఆకట్టుకున్నారట. 

మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు వీక్షించే సమయంలో జ్యూరీ సభ్యులు కొందరు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారని, అలా సావిత్రిగారి వాస్తవిక పాత్రకు జీవం పోయడం కీర్తి కె సాధ్యమైందని వారందరూ భావించారట. అంతేకాక జ్యురిలోని ఎక్కువ మంది సబ్యులకు ఈ సినిమా నచ్చడం, మరీ ముఖ్యంగా కీర్తి వాస్తవిక నటన మరింతగా హృదయానికి తాకడంతో, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చివరిగా ఆమెనే ఉత్తమ నటిగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఇకపై కీర్తి సురేష్ గురించి మాట్లాడాలంటే, మహానటి ముందు మహానటి తరువాత అనే మాట్లాడాలి అని అంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనప్పటికీ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకోనున్న కీర్తి సురేష్ గారికి హృదయ పూర్వక అభినందనలు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: