టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు దేశంలో మారుమ్రోగుతోంది. 'బాహుబలి' పుణ్యమా అంటూ ఇండియన్ ఫిలిమ్స్ దమ్ము ప్రపంచ స్థాయికి తెలియజేశాడు తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇదే క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు ఇటీవల రీమేక్ చేస్తూ టాలీవుడ్ జపం చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ దగ్గర సంచలన రికార్డులు సృష్టిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా 28 సంవత్సరాల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి జాతీయ అవార్డు దక్కడం విశేషం. అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాకి జాతీయ పురస్కారం దక్కింది. ఈ సినిమాలో సావిత్రి మాత్రమే చేసిన కీర్తి సురేష్ కి అవార్డు దక్కడం విశేషం.

Image result for keerthi suresh vijayshanthi

దీంతో హీరోయిన్ కీర్తి సురేష్ పై అలాగే సినిమా యూనిట్ పై ప్రశాంసాల వర్షం కురిపించారు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా కీర్తి సురేష్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే దాదాపు 28 సంవత్సరాల తర్వాత అనగా అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి కర్తవ్యం సినిమా కు గాను ఉత్తమ జాతీయ నటి అవార్డు దక్కించుకుంది. ఆ తర్వాత ఇప్పుడు ఆ ఘనత కీర్తి సురేష్ కి దక్కింది. భారత ప్రభుత్వం ఈ జాతీయ పురస్కారం అవార్డును 1967 నుండి ఇవ్వటం మొదలు పెట్టారు ఇప్పటి వరకు మొత్తం మీద 41 మంది నటీమణులు జాతీయ అవార్డును గెలుచుకున్నారు.

Image result for keerthi suresh vijayshanthi

అయితే ఎక్కువగా షబానా ఆజ్మీ ఐదుసార్లు జాతీయ ఉత్తమ నటిగా ఎంపికవ్వడం విశేషం. తెలుగులో అయితే తొలిసారిగా నటి శారద గారు ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. అప్పట్లో అనగా 1978లో నిమజ్జనం సినిమాకి శారదా గారికి ఈ అవార్డు లభించింది. ఆ తర్వాత కొంతమంది తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారికి జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కింది. అయితే విజయశాంతి దక్కించుకున్న తర్వాత అనగా 28 సంవత్సరాల తర్వాత కీర్తి సురేష్ కి ఇటీవల ఈ అవార్డు అందుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు హీరోయిన్ కీర్తిసురేష్ పై అలాగే 'మహానటి' డైరెక్టర్ నాగ అశ్విన్ కు అభినందనలు తెలియజేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: