టాలీవుడ్ బోర విడిచుకుంటుంది ఎపుడూ టాప్ స్టార్లను చూసి. అందుకే తెలుగులో మంచి కధలకు కాలం చెల్లిందని మిగిలిన భాషలకు రచయితలు, టెక్నీషియ‌న్లు వెళ్ళిపోతున్నారు. కధ ఎవరికి కావాలి. నటన అంతకంటే ఎందుకు కావాలి. అటూ ఇటూ గ్లామర్ డాల్స్, నాలుగు రొమాంటిక్ సాంగ్స్, యాక్షన్ పార్ట్, రొడ్డకొట్టుడు పగ ప్రతీకారం ఇవి చాలు తెలుగు సినిమా తయారైపోవడానికి.


లేటెస్ట్ గా ప్రకటించిన జాతీయ అవార్డులను చూస్తే బాధ, సిగ్గు రెండూ కలుగుతాయి. ఈసారి కొంత వూరట ఏంటి అంటే మహానటి సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ కి ఉత్తమ జాతీయ నటి అవార్డు రావడం. ఎక్కడో మళాయళంలో పుట్టిన అమ్మాయి తెలుగులో మన సావిత్రమ్మ జీవిత కధను చేసి నేషనల్ అవార్డ్ విన్నర్ గా నిలిచింది అంటే గ్రేట్. 


ఇక తెలుగులో స్టార్ల గురించి చెప్పుకుంటే ఒకరా ఇద్దరా ఎంతో మంది ఉన్నారు. కానీ ఎవరికీ జాతీయ పురస్కారాలు రాలేదు. ఉత్తమ జాతీయ కధానాయకుడు అవార్డ్ ని ఎన్నో సార్లు పొరుగున ఉన్న తమిళనాడు గెలుచుకుంది. ఇతర రాష్ట్రాలు తెచ్చుకున్నాయి. తెలుగులో మాత్రం స్టార్లు ఆ వైపు చూడరు. అవి తమకు అక్కరలేదు అనుకుంటారు.


ఫ్యాన్స్ ఉంటే చాలు సినిమాలు చేసి కోట్లు సంపాదించుకోవచ్చు అనుకుంటారు. మనకు దమ్మున్న హీరోలు ఎందరో ఉన్నారు.  మంచి కధను నమ్మి సినిమాను చేస్తే తప్పకుండా జాతీయ పురస్కారాలు మన ఒడిలోనూ పడతాయి. మహానటిని ఎలా నమ్మి తీశారు. ఇపుడు అలాటి కధలు వస్తే చేసేందుకు స్టార్లు రెడీగా ఉన్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న.


తమ కళను ప్రదర్శించి కళా దాహాన్ని కూడా తీర్చుకోవాలి. నటుడు అన్న వాడు అన్ని రకాలుగా అభినయం ప్రదర్శించాలి. శభాష్ అనిపించుకోవాలి. మన టాలీవుడ్ స్టార్లు, సూపర్ స్టార్లు, ముందు ఆరిస్టులుగా మారాలి. మంచి సినిమాలకే ఓటు వేయాలి. అపుడే జాతీయ ఉత్తమ కధానాయకులు అవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: