చలన చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డులు నిన్న సాయంత్రం ప్రకటించారు. దేశంలోని అన్ని భాషల నుండి వచ్చిన సినిమాల్లో ఉత్తమమైన వాటికి అవార్డులు వరించాయి. భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర అవార్డులను సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు ప్రకటించారు. సాధారణంగా ప్రతీసారి ఏప్రిల్ నెలలోనే ప్రకటించే ఈ అవార్డులు లోక్ సభ ఎన్నికల కారణంగా ఆలస్యంగా ప్రకటించారు.



అయితే ఈ సారి జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాల హవా కొనసాగింది. ఒకేసారి నాలుగు సినిమాలకు అవార్డులు రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. గత మూడు సంవత్సరాల నుండి తెలుగు సినిమా మారుతూ వస్తుంది. ఇప్పుడు జాతీయ అవార్డులు రావడం ఈ మార్పుకు నిదర్శనం అనే చెప్పాలి.'మహానటి' సినిమా ఉత్తమ చిత్రంగా సెలెక్ట్ కాగా, అదే సినిమాకు గాను ఉత్తమ హీరోయిన్ కేటగిరీలో కీర్తి సురేష్ అవార్డు దక్కించుకుంది


సౌండ్ మిక్సింగ్ విభాగంలో "రంగస్థలం", బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో "చి.ల.సౌ" బెస్ట్ మేకప్ విభాగంలో "అ" సినిమాలకు అవార్డులు వచ్చాయి.   ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ అవార్డులపై స్పందించగా తాజాగా రాజమౌళి రియాక్ట్ అయ్యారు. ''వివిధ కేటగిరీల్లో తెలుగు సినిమాలు అవార్డులు దక్కించుకోవడం ఆనందంగా ఉంది.


మహానటి, రంగస్థలం, అ!, చి ల సౌ చిత్రాల యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు'' అని ట్వీట్ చేశారు జక్కన్న.రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది జులై నెలలో ఈ సినిమా విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: