రెండు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షోకు ఈ షో ప్రారంభం కాకముందే వివాదాలు మొదలయ్యాయి. యాంకర్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ షో నిర్వాహకులపై సంచలన వ్యాఖ్యలు చేసారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు బిగ్ బాస్ షోకు ఎంపికయితే మా బాస్ ను ఎలా ఇంప్రెస్ చేస్తావని అడిగారని పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసారు. మరో నటి గాయత్రి గుప్తా కూడా బిగ్ బాస్ షోకు ఎంపికయినట్లు చెప్పారని కానీ తరువాత బిగ్ బాస్ షోలో అవకాశం ఇవ్వలేదని ఈ షో వలన ఆరు సినిమాలు కోల్పోయానని అన్నారు. 100 రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా అని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రశ్నించారని మీడియాతో తెలిపారు. 
 
దర్శకనిర్మాత కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి గతంలో బిగ్ బాస్ షో సెన్సార్ చేసి ప్రసారం చేయాలని కోర్టులో కేసు వేసాడు. మరోసారి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి బిగ్ బాస్ షో అసాంఘిక కార్యకలాపాలు, అసభ్యతను ప్రోత్సహించే విధంగా ఉందని హైకోర్టు లో పిల్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. యువతను తప్పుదారి పట్టించే విధంగా బిగ్ బాస్ షో ఉందని, ఈ షోను సెన్సార్ చేసి ప్రసారం చేయాలని పిల్ లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సమాచార మంత్రిత్వ శాఖ కార్యదర్శులను  చేర్చినట్లు తెలుస్తుంది. 
 
రెండు వారాల క్రిందట ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ సీజన్3 లాంఛింగ్ ఎపిసోడ్ 17.90 టీఆర్పీ రేటింగ్ అందుకుంది. బిగ్ బాస్ సీజన్ 2 హిట్ కాకపోయినా సీజన్ 3 మాత్రం ప్రేక్షకుల్ని బాగానే అలరిస్తుంది. మొదటి వారం బిగ్ బాస్ షో నుండి నటి హేమ ఎలిమినేట్ కాగా రెండో వారం ఈ షో నుండి జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: