మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు స్టార్ హీరో స్ కి సంబంధించిన ఫ్యాన్స్ గొడవలు పెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. అందుకు ముఖ్య కారణం మన వాళ్ళు ఎప్పుడు కలిసి ఒకే వేదికపైన కనపడటం, ఒకరి ఫంక్షన్స్ కి మరొకరు హాజరవడం ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి ఉత్సాహాన్నిస్తుంది. ఒకవేల అనుకోకుండా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్యలో చిన్న చిన్న గొడవలు మొదలైనా మన వాళ్ళు వెంటనే స్పందించి ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగే ఆస్కారం లేకుండా చేస్తారు.ఈ విషయంలో మన టాలీవుడ్ హీరోలు నిజంగా హీరోలే అని చెప్పాలి. కానీ కోలీవుడ్ లో ప్రస్తుతం పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి.కోలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోస్ అభిమానుల మధ్యన బీభత్సమైన ఫ్యాన్స్ వార్ నడుస్తుంది. హీరో విజయ్ మరియు అజిత్ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం విజయ్ చనిపోయాడంటూ యాష్ ట్యాగ్ తో అజయ్ ఫ్యాన్స్ ఓ వార్తను వైరల్ చేయగా, తాజాగా విజయ్ ఫ్యాన్ ఒకరు అజిత్ ఫ్యాన్ పై కత్తితో దాడి చేయడం కోలీవుడ్‌లో పెద్ద దుమారం రేపింది.

ఇంత జరుగుతున్నా ఈ హీరోలు మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ విషయంలో మన టాలీవుడ్ స్టార్ హీరోలు గొప్పే కాదు కోలీవుడ్ హీరోలకు చాలా ఇస్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు.ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, బన్నీ వంటి హీరోలు కలిసి ఒకే వేడుకలపై సందడి చేస్తున్నారు. ఆ మధ్య మహేష్ ఎన్టీఆర్ ఓ చిత్ర వేడుక కార్యక్రమంలోపాల్గొని ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు.ఆ సందర్బంలో మహేష్ ఓపెన్ గా మేమందరం బాగానే ఉంటాం, ఫ్యాన్స్ మీరెందుకు కొట్టుకుంటారు అని ప్రశ్నించడం జరిగింది. ఇక మహేష్, ఎన్టీఆర్ లతో చరణ్ చాలా సన్నిహితంగా ఉంటారు.వీరు ముగ్గురు కుటుంబ సమేతంగా అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. 

ప్రభాస్ గురించి చెప్పాలంటే నిగర్వి, చిన్న, పెద్ద హీరోలనే భేదం లేకుండా అందరితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు. ముఖ్యంగా బన్నీ, ప్రభాస్ మంచి మిత్రులు అని చెప్పాలి. గతంలో కంటే టాలీవుడ్ లో ఫ్యాన్ వార్ లు చాలా వరకు తగ్గిపోయాయి అని చెప్పవచ్చు.నాని ప్రభాస్ మూవీని ఉద్దేశిస్తూ ఈ మూవీ మాది, ప్రభాస్ అన్న సాహో భారీ విజయం సాధించాలని ట్వీట్ చేయడం గమనార్హం. మరి కోలీవుడ్ స్టార్ హీరోలైన రజని, అజిత్, విజయ్, కమల్, విక్రమ్ లాంటి వారు ఈ విధంగా ఎందుకు ఆలోచించడం లేదు అనేది ఇప్పుడు అంతటా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ఈ విషయం పై దృష్టి పెట్టకపోతే భవిష్యత్ లో మరిన్ని బాధాకర సంఘటనలను చూడాల్సివస్తుందని కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: