ఈ సంవత్సరం ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేయగల అవకాశం కేవలం ‘సైరా’ ‘సాహో’ లకు మాత్రమే ఉంది. కేవలం ఒకనెల గ్యాప్ లో విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాల బిజినెస్ 800 కోట్లకు పైగా జరగబోతోంది. దీనితో ఈ రెండు మూవీలను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు లాభ పడాలి అంటే కనీసం ప్రతి సినిమా పై 500 కలక్షన్స్ వచ్చితీరాలి. 

దీనితో ఈరెండు సినిమాలకు భారీ ప్రమోషన్ చేయబోతున్నారు. అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘సైరా’ ట్రైలర్ ఈ నెలలో జరగబోతున్న ‘సైమా’ అవార్డుల ఫంక్షన్ లో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ హంగామా చాలదు అన్నట్లుగా ‘సైరా’ ట్రైలర్ ను ‘సాహో’ మూవీ ఇంట్రవెల్ సమయంలో చూపించబోతున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా ‘సాహో’ విడుదలైన ప్రతి ధియేటర్ లోను ‘సైరా’ సందడి కనిపించ బోతోంది. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా ప్రభాస్ కు తెలిపినప్పుడు తన సినిమాలో ‘సాహో’ ట్రైలర్ రావడం తన సినిమాకు ఒక గౌరవం అంటూ కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మెగా అభిమానుల సందడి ‘సాహో’ ధియేటర్లలో కనిపించబోతోంది. 

టాప్ హీరోలు ఎంతమంది ఉన్నా ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ చిరంజీవిలను ఒకే ధియేటర్ లో ముఖ్యంగా మల్టీ ప్లెక్స్ భారీ స్క్రీన్స్ లో చూసే అవకాసం ప్రేక్షకులకు ఒకేసారి లభించబోతోంది. ‘సాహో’ టాక్ ఎలా వైరల్ అవుతుందో ‘సైరా’ ట్రైలర్ కూడ ఈ ప్రయోగంతో అలాగే వైరల్ అయ్యే ఆస్కారం కనిపిస్తోంది. దీనికితోడు ప్రస్తుతం యూత్ చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా కుదిరే పరిస్థితి లేదు కాబట్టి ‘సాహో’ విడుదల రోజు నుండి ఆ సినిమా టాక్ గురించి మాత్రమే కాకుండా ‘సైరా ట్రైలర్ గురించి కూడ బాగా చర్చించుకునే ఆస్కారం కనిపిస్తోంది..
 


మరింత సమాచారం తెలుసుకోండి: