ప్రతి ఏడాది కేంద్రప్రభుత్వం జనవరి 26 వ తేదీన పద్మశ్రీ అవార్డులను ప్రధానం చేస్తుంది.  ఈ అవార్డులకోసం వివిధ రంగాల్లో సేవలు చేసిన, గుర్తింపు పొందిన వ్యక్తులను సెలక్ట్ చేసి ప్రధానం చేస్తుంది.  ప్రతి సంవత్సరం సినిమా రంగానికి చెందిన వ్యక్తులు ఈ అవార్డులను అందుకునే వాళ్లలో తప్పకుండా ఉంటారు.  ఇప్పటికే ఎందరో ఈ అవార్డులను అందుకున్నారు.  అయితే, పేరుకు ముందు ఈ పురస్కారాన్ని పెట్టుకోకూడదని కోర్టు ఇప్పటికే తీర్పును ఇచ్చింది.  


అయినప్పటికీ కొందరు తీర్పును పక్కన పెట్టి స్క్రీన్ మీద పేరు పెట్టుకుంటుంటారు.  పద్మ అవార్డులు అందుకున్న తరువాత చాలామంది ఐటి రైడ్స్ లో దొరికిపోయిన సంగతి తెలిసిందే.  అయినా అవార్డులను కేంద్రం వెనక్కి తీసుకోలేదు.  నటీనటులు కూడా వెనక్కి ఇవ్వలేదు.  కానీ, ఓ నటుడి విషయంలో ఇలా జరిగింది.  ఆ నటుడు ఎవరో కాదు.. కిషోర్ కుమార్.  


కిషోర్ కుమార్ నటుడిగా కంటే కూడా సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  కిషోర్ కుమార్ తన పాటలతో బాలీవుడ్ ను ఉర్రూతలూ ఊగించాడు.  బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చేసిన గుర్తింపుకు ఆయనకు కేంద్రం 1981 వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును ఇవ్వాలని అనుకుంది.  ఆయన పేరును కేంద్రం అవార్డుల కమిటీకి సిఫార్సు కూడా చేసింది.  


అంతా ఒకే అయ్యింది.  మరి కొన్ని రోజుల్లో అవార్డులు ఇవ్వాలి.  ఇంతలో ఆయన ఇంటిపై ఐటి శాఖా అధికారులు దాడి చేశారు.  ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టుగా తేలింది.  లెక్కలోకి రాని సొమ్మును సీజ్ చేశారు.  దీంతో కేంద్రం ఆయనకు పద్మా అవార్డులు ఇవ్వాలా వద్ద అనే ఆలోచనలో పడింది.  ఒకవేళ ఇస్తే.. దాని వలన కేంద్రానికి కళంకం వస్తుందని భావించిన ప్రభుత్వం, అవార్డును రద్దు చేసింది.  అలా గుమ్మం దాకా వచ్చిన అవార్డు.. ఐటి అధికారుల దాడి కారణంగా వెనక్కి వెళ్ళిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: