సినిమా చిన్నదే అయినా అందరిలో ఉత్కంఠ రేపుతోంది అంటూ టాలీవుడ్ లో ఓ చిన్న సినిమాపై టాక్ వినిపిస్తోంది. సహజంగా పెద్ద బ్యానర్, స్టార్ హీరోయిన్, ప్రముఖ దర్శకుడు, లేదా భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతుంటే అందరిలో భారీ అంచనాలు, విడుదలకోసం ఉత్కంఠ నెలకొనడం సహజమే. కాని తక్కువ బడ్జెట్ తో తెరపైకి వస్తున్న ‘బిస్కట్’ సినిమా కోసం చాలా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది అంటున్నారు సినీ విశ్లేషకులు. కారణం యువత, ప్రస్తుత జెనరేషన్ మైండ్ సెట్ కు తగ్గట్టుగా సినిమా తీసారట. అంతే కాదు ప్రధానంగా ప్రోఫేనల్స్ లో ఇది బాగా ఆసక్తి రేకేత్తిస్తోంది అంటున్నారు. కారణం సాడిస్ట్ బాస్ లు, వారి వద్ద ఉద్యోగాలు ఎలా అన్నది కూడా ఈ సినిమాలో వాస్తవానికి దగ్గరగా చూపించారు అంటున్నారు. ఈ సినిమాకు గోపిచంద్ దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాతలు దీపక్, స్రవంతి. అరవింద్ కిషోర్ ప్రదాన పాత్రను వెన్నెల కిషోర్ తో కలిసి ఇద్దరితో చాలా బాగా తీసారంటున్నరు. హీరోయిన్ గా డింపుల్ చొపాడే నటిస్తుండగా ఈ సినిమాలో హాస్యనటుడు అలీ ప్రదాన ఆకర్శన అంటున్నారు. అలీతో పాటు ఎంఎస్ నారాయణ, అజయ్ లు కూడా బాగా నవ్వులు పండించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: