టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన మ‌న్మ‌థుడు 2 సినిమా భారీ అంచ‌నాలు, భారీ ప్ర‌మోష‌న్ల‌తో ఈ శుక్ర‌వారం థియేట‌ర్లోకి దిగింది. మ‌రోవైపు అన‌సూయ క‌థ‌నం, విశాల్ రీమేక్ అయోగ్య‌, క‌న్న‌డ మ‌హాభార‌తం డ‌బ్బింగ్ కురుక్షేత్ర లాంటి సినిమాల‌తో పాటు శ‌నివారం సంపూర్ణేష్ కొబ్బ‌రిమ‌ట్ట సినిమాలు లైన్లో ఉన్నా కూడా నాగ్ త‌న సినిమాను రిలీజ్ చేశారు. 


సినిమాపై ఉన్న హైప్‌. ఆల్రెడీ మ‌న్మ‌థుడు లాంటి క్లాసిక్ మూవీ టైటిల్‌తో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో పాటు నాగ్ ఫ్యామిలీ చేసిన ప్ర‌మోష‌న్ల‌తో సినిమా సూప‌ర్ హిట్ అవుదుంద‌నే అంద‌రూ అనుకున్నారు. ఈ సినిమాకు ఏకంగా రూ.24 కోట్ల వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జ‌రిగింది. తీరా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి ఫ‌స్ట్ షో ప‌డిందో లేదో సినిమా చాలా చెత్త‌గా ఉంద‌న్న టాక్ వ‌చ్చేసింది.


నాగార్జున ఈ వ‌య‌స్సులో చేయాల్సిన సినిమా కాద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చేశాయి. ప్రేక్షకుల నుంచే కాకుండా క్రిటిక్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మ‌న్మ‌థుడు 2 ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. ఇక ఓవ‌ర్సీస్‌లో కూడా ఈ సినిమా అట్ట‌ర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. గురువారం యూఎస్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ $ 82,284 గ్రాస్ వసూళ్లు సాధించిందని సమాచారం.


నాగార్జున లాంటి స్టార్ హీరోకు ఇవి చాలా త‌క్కువ వ‌సూళ్లే. ఇక శుక్ర‌వారం అప్‌డేట్ చూసినా $ 23,766 గ్రాస్ వసూళ్లతో ఇప్పటివరకు అక్కడ మొత్తం $ 1, 23,236 గ్రాస్ వసూళ్లు సాధించిందని తెలుస్తుంది. మూవీపై మిశ్రమ స్పందన ఉన్న నేపథ్యంలో మన్మధుడు 2 మూవీ ఏమాత్రం వసూళ్లు సాధిస్తుందో చూడాలి. ఏదేమైనా మ‌న్మ‌థుడు 2కు ఓవ‌రాల్‌గా డిజాస్ట‌ర్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. మ‌రి ఇంత వీక్ టాక్‌తో నాగ్ ఎలా నెట్టుకొస్తాడో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: