దేశం మొత్తం ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూస్తుంది. జాతీయ స్థాయిలో మన వాళ్ళ ప్రతిభ వెలుగులోకి వచ్చిన తరుణం ఇది. తెలుగు సినిమాలకు అవార్డులే రావా? ... అసలు అంత టాలెంట్ మన దగ్గర లేదా?..లేదంటే అవార్డు సినిమాలు తీయాలంటే మన వాళ్ళు భయపడుతున్నారా ?..అని ఎన్నో రోజులుగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే వీటన్నింటికి సమాధానం నిన్న సాయంత్రం వచ్చింది.


జాతీయ స్థాయిలో మన చిత్రాలు అవార్డుల పంట పండించాయి. కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు అవార్డులు మన వాళ్ళని వరించాయి. తెలుగులో నాలుగు సినిమాలు... మహానటి, రంగస్థలం, అ!, చి.ల.సౌ చిత్రాలు అవార్డులను దక్కించుకున్నాయి.ముఖ్యంగా ఓ తెలుగు సినిమా నటికి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం దక్కడం ఈసారి అవార్డుల్లో అత్యంత ప్రత్యేకం. కీర్తి సురేష్ మనమ్మాయి కాకపోయినా.. మన సినిమాలో నటనకే ఆమెకు అవార్డు దక్కింది.


‘మహానటి’ ముందు వరకు కీర్తిని ఒక సాధారణ నటి. ఆమె నుంచి అద్భుత నటన రాబట్టుకున్న ఘనత మన నాగ్ అశ్విన్‌కే దక్కుతుంది. ఒక తెలుగు సినిమా నటికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కి ఏకంగా 29 ఏళ్లు కావడం విశేషం. 1990లో విజయశాంతి ‘కర్తవ్యం’ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. మహానటి సినిమాకి ఏకంగా మూడు అవార్డులు రావడం ఇంకా ఆనందించాల్సిన విషయం. 


రామ్ చరణ్ తన నటనతో  మెస్మరైజ్ చేసిన రంగస్థలం సినిమాకి సౌండ్ మిక్సింగ్ విభాగంలో, విభిన్నమైన కథనంతో న్యూ ఏజ్ సినిమాగా వచ్చిన "అ!" మూవీకి బెస్ట్ మేకప్,  విభాగంలో రెండు అవార్డులు వచ్చాయి. చి.ల.సౌ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ తన సినిమాకి గాను బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలు అటు కమర్షియల్ గానూ, ఇటు అవార్డుల పరంగానూ విజయం సాధించాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: