66వ ఫిలిం నేషనల్ అవార్డ్స్ ప్రకటన వచ్చి ఒక్కరోజు గడవకుండానే ఆ అవార్డ్స్ ఎంపికను టార్గెట్ చేస్తూ అనేక ఘాటైన విమర్శలు మీడియాలో వస్తున్నాయి. ముఖ్యంగా ఈ విమర్శలను మెగా అభిమానులు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఈ అవార్డ్స్ ఎంపికలో రామ్ చరణ్ కు అన్యాయం జరిగింది అంటూ గగ్గోలు పెడుతున్నారు. 

గత ఏడాది విడుదలై సంచలనం సృష్టించిన ‘రంగస్థలం’ మూవీలో చెవిటి వాడుగా చిట్టి బాబు పాత్రను అద్భుతంగా చరణ్ పోషించడంతో అతడి నటనకు కనీసం స్పెషల్ జ్యూరీ అవార్డ్ అయినా వస్తుందని చాలామంది అంచనాలతో ఊహాగానాలు చేసారు. వాస్తవానికి ఈ ఏడాది జాతీయ స్థాయి ఉత్తమనటుడు అవార్డు అందుకున్న ఆయుష్మాన్ ఖురానా స్పెషల్ జ్యూరీ అవార్డ్ ను అందుకున్న విక్కీ కౌశల్ ల స్థాయికి రామ్ చరణ్ చిట్టి బాబు పాత్ర నటన అన్ని విధాల సరిసమానంగా ఉందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. 

అయితే కనీసం చరణ్ నటనకు ప్రశంసలు కూడ జాతీయ అవార్డ్ ల జ్యూరీ నుండి లభించక పోవడం చరణ్ కు జరిగిన తీవ్ర అన్యాయం అంటూ మీడియాలోని కొన్ని వర్గాలు ఘాటైన విమర్శలు చేస్తున్నాయి. ఇదే సందర్భంలో మరికొందరు ‘రంగస్థలం’ స్క్రీన్ ప్లే రాహుల్ రవీంద్రన్ ‘ఛీ.ల.సౌ’ స్క్రీన్ ప్లే కన్నా బాగుంది అంటూ ఈవిషయంలో సుకుమార్ కు కూడా అన్యాయం జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అదేవిధంగా ‘రంగస్థలం’ మూవీ కోసం ఒక ప్రత్యేకమైన 1980 కాలం నాటి సెట్ ను సుకుమార్ వేయించినా దానికి కూడా ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో గుర్తింపు లేకపోవడం అన్యాయం అని అంటున్నారు. కీర్తి సురేశ్ కు ‘మహానటి’ లో నటించినందుకు అవార్డ్ రావడం మంచిది అయినా చరణ్ ను అన్ని విధాల నిరాశ పరచడం అన్యాయం అని అంటున్నారు. అయితే ఉత్తమ నటుడు ఉత్తమ నటి రెండు అవార్డులు దక్షిణ ప్రాంత సినిమాలకు ఇవ్వడం అవార్డ్స్ కమిటీ జ్యూరీలో ఎక్కువగా ఉన్న ఉత్తరాది ప్రాంతం వారికి ఇష్టం లేక ఇలా ఈ అవార్డ్స్ సద్దుబాటు చేసారు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: