సినీ పరిశ్రమ వెలుగు జిలుగులమయం. అక్కడంతా మెరుపులే తప్ప మరోటి కనిపించవు. సినిమా జీవితం చిత్రాతిచిత్రం. అందలం ఎక్కించిన అందమే వెగటు పుట్టిస్తుంది. వద్దు పొమ్మంటుంది. ఫ్యాన్స్ చూసి పొంగిపోయినంతసేపు పట్టదు పక్కనున్న వారు వీడిపోవడానికి.  పూరీ అదేదో సినిమాలో చెప్పినట్లుఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతీ వారి సరదా తీర్చేస్తుంది.  అందరి డౌట్లకు ఆన్సర్ చెప్పేస్తుంది.


సినీ పరిశ్రమలో మిల్కీ బేబీ తమన్నా కెరీర్ దాదాపుగా ఎండ్ అవుతోంది. తమన్నా యంగ్ హీరోల పక్కన నిలిచి వానా వానా వెల్లువాయే అంటే కుర్ర కారు కిర్రెక్కారు. ఆ తరువాత ఆమె చేసిన డ్యాన్సులు చూసి వెర్రెక్కారు. వరస హిట్లు చూసింది. అంతలోనే ఫ్లాప్స్ వచ్చిపడ్డాయి. మన హీరోలకు హిట్లు అంటే వారివి, ఫ్లాప్స్ అంటే హీరోయిన్లు, డైరెక్టర్లవి. ఇలా ఫిక్స్ అయిపోయిన ఫీల్డ్ లో తమన్నా బ్యాక్ బెంచ్ కి వెళ్ళిపోయింది.


తమన్నా కావాలని కోరిన, పోరిన స్టార్లే ముఖం చాటేస్తున్నారు. మరో వైపు ష‌ష్టి పూర్తి చేసుకున్న హీరోల నుంచి మాత్రం ఆఫర్లు వస్తున్నాయి. సీనియర్ హీరోలు తమ పక్కన చోటిస్తున్నారు, కొడుకులతో నటించి తండ్రుల పక్కన వేయడం అంటే నగుబాటే. దాంతో తమన్నా తెలివినా నో చెప్పేసింది. ఇపుడు ఆమె సినిమాలు లేవని గ్రహించి పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయిపోయింది. రీసెంట్ గా ఆమె తన పెళ్ళి ముచ్చట్లు కూడా మీడియకు చెప్పి తొందరలోనే పీటలెక్కబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చేసింది.


మరి మిగిలిన హీరోయిన్ల విషయానికి వస్తే రకుల్ ప్రీత్ సింగ్ ఉంది. ఆమెకు కూడా తమన్నాలాగానే యంగ్ హీరోలు  నో చెబుతున్నారు. హిట్లున్న రోజుల్లో  రకుల్ అని కలవరించిన వాళ్ళే ఇపుడు వద్దు అంటున్నారు. దాంతో రకుల్ సీనియర్ హీరోల వైపు మొగ్గింది. ఏజ్ బార్ హీరోలతో రొమాన్స్ చేసింది. రిజల్ట్ ఫల్టీ కొట్టింది. నిన్న విడుదల అయిన మన్మధుడు 2 మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దాంతో రకుల్ ఫ్యూచర్ ఏంటో  అర్ధం కావడంలేదట. మరి ఈ అమ్మడు కూడా తమన్నా రూట్లోకి వెళ్తే బెటర్ అంటున్నారు. అంటే మూడు ముళ్ళు వేయించేకుంటే సరి అనేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: