తమిళ నటుడు విజయ్ సేతుపతి క్రేజ్ ఈ మధ్యన స్టార్ హీరోలతో సమానంగా కనిపిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. చిన్న..పెద్ద సినిమాలంటూ చూడడమే కాదు.... హీరో పాత్రలే కాదు... సినిమాలో కీలకమైన పాత్ర ఏది దొరికిన విజయ్ సేతుపతి వదలకుండా కమిటవుతున్నాడు. నటుడిగా ఛాలెంజింగ్ పాత్రలకు సై అంటున్న విజయ్ సేతుపతి...తెలుగులో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రిగా విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక విజయ్ సేతుపతి విలన్ రోల్ అంటే ఆ సినిమాకి మాములుగా క్రేజ్ ఉండదు. అయితే కొన్ని రోజుల నుండి విజయ్ సేతుపతి, వైష్ణవ్ తేజ్ ఉప్పెన నుండి తప్పుకున్నాడని ప్రచారం జరిగినప్పటికి అందులో వాస్తవం లేదని తేలిపోయింది.

అయితే ఇలాంటి వార్తే మరోసారీ వైరల్ అవుతోంది. తాజాగా విజయ్ సేతుపతి మరో సినిమా నుండి తప్పుకున్నాడనే ప్రచారం మొదలైంది. అది కూడా ఓ లెజెండరీ క్రికెటర్ బయోపిక్ నుండి అని తెలుస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా శ్రీలంక లెజెండరి క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ని టాలీవుడ్ హీరో రానాతో కూడా నిర్మాతలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎప్పుడో సినిమా మీద అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే త్వరలోనే ముహూర్తం పెట్టుకోనున్న ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లుగా సమాచారం. ఆయన క్రేజ్ కి ఈ సినిమా చేస్తే బావుండేదని విజయ్ అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా హీరో రానా కూడా ఈ సినిమా బడ్జెట్ పరిమితికి మించి ఉండడంతో రానా కూడా డైలమాలో పడినట్లుగా టాక్. 

మరి సచిన్ లాంటి క్రికెటర్ గెస్ట్ రోల్ అంటే ఆ సినిమా ఓ రేంజ్ లో ఉండాలి అంటే భారీ బడ్జెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. మరి అటు విజయ్, ఇటు రానా కూడా ఆలోచనలో పడుతున్నారంటే.. అసలా సినిమా ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఇక విజయ్ సేతుపతి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. అంతేకాదు ఈ సినిమా రిలీజైయ్యాక తెలుగులో విజయ్ కి మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని చాలా మంది చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: