ప్రతి సంవత్సరం కేంద్రప్రభుత్వం దేశంలోని బెస్ట్ సినిమాలకు అవార్డులను లభిస్తుంటాయి.  ఈ ఏడాది కూడా కేంద్రం కొన్ని సినిమాలకు అవార్డులను ప్రకటించింది.  ఈ ఏడాది 66 వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించారు.  ఇందులో మహానటికి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైతే.. జాతీయ ఉత్తమ హిందీ సినిమాగా యూరిని ఎంపిక చేసింది.  



ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కు అవార్డు దక్కగా, ఉత్తమ నటులుగా ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ లకు అవార్డులు వరించాయి.  అయితే, మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కింది.  ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ సినిమా.  అలానే యూరి సినిమా విషయానికి వస్తే.. యూరి సెక్టార్ లో జరిగిన దాడులను బేస్ చేసుకొని యూరి సినిమా వచ్చింది.  ఈ సినిమా మంచి విజయం సాధించింది.  



ఈ సినిమాలో అత్యుతమ ప్రదర్శనకు విక్కీ కౌశల్ కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది.  మహానటి, యూరి రెండు సినిమాలు రియాలిటీ సినిమాలే.  మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కింది.  యూరి దాడుల నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు.  గతంలో చూసుకున్నా బయోపిక్ సినిమాలకే ఉత్తమ నటీనటుల అవార్డులు, ఉత్తమ చిత్రాల అవార్డులను సొంతం చేసుకున్నాయి.  


గతంలో అక్షయ్ కుమార్ ఎయిర్ లిఫ్టింగ్, రుస్తుం సినిమాలకు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.  ఈ రెండు సినిమాలు బయోపిక్ సినిమాలే.  నీర్జా బానోత్ జీవితం ఆధారంగా తీసిన నీర్జా సినిమాకు గాను సోనమ్ కపూర్ కు ఉత్తమనటి అవార్డు సొంతం చేసుకుంది.  అంతకు ముందు పాన్ సింగ్ తోమర్ సినిమాకు గాను ఇర్ఫాన్ ఖాన్ కు ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నారు.  డర్టీ పిక్చర్ కు గాను విద్యాబాలన్ కు ఉత్తమ నటి అవార్డు వచ్చింది.  ఉత్తమ నటీనటులు అవార్డులు అందుకున్న చాలా సినిమాలు బయోపిక్ సినిమాలే కావడంతో ఈ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: