సాధారణంగా అమ్మాయీలను అసహ్యంగా చూసేవాళ్ళు, కామెంట్ చేసే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడే తయారవుతున్నారు. వర్కింగ్ ప్లేస్, షాపింగ్ మాల్స్..ఇలా అన్నీ చోట్లా ఇలాంటి వెధవలే. ఇక సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ఆడపిల్లలను ఆటపట్టించడమే కాదు ఆ క్షణంలో హద్దు అదుపు లేకుండా ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నారు..అడిగేస్తున్నారు. సెలబ్రిటీస్ దగ్గర్నుంచి సామాన్యమైన అమ్మాయిల వరకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటున్న వాళ్ళు కోకొల్లలు. ఇలాంటి వ్యవహారంపై బుల్లితెర యాంకర్, హీరోయిన్ రష్మీ గౌతమ్ ఘాటుగా స్పందించారు.  అంతేకాదు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్ లలో సెలబ్రిటీస్ ని, అమ్మాయిలను ఫాలోవుతున్న ఆకతాయిలు చాలా నీచంగా కామెంట్స్ పెట్టడమే కాదు అడ్డమైన మెసేజులు పంపుతున్నారు. 

నేను ఒక సెలబ్రెటీని కాబట్టి నాకు మాత్రమే ఇలాంటి మెసేజ్ లు వస్తున్నాయని అందరు అనుకుంటున్నారు. కాని ఇలాంటి చెత్త మెసేజ్ లు సామాన్యులైన అమ్మాయిలకు కూడా వస్తున్నాయి. కొందరు ఆకతాయిలు అమ్మాయిలను ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ గురించి అమ్మాయిలు బయటకు మాట్లాడలేకపోతున్నారు. ఉద్యోగం చేసే వారికి.. సోషల్  మీడియాలో ఉండే వారికి ఇలాంటి కామెంట్స్ చాలా కామన్ అయ్యాయని రష్మి ఆవేదన వ్యక్తం చేశారు. 'ఒక నైట్ కు ఎంత ఇస్తే వస్తావు' అంటూ అమ్మాయిలను కొందరు ప్రశ్నిస్తున్నారు.

అయినా అమ్మాయిలు ఎందుకు వస్తారు. అలా వస్తావా అని అడగడానికి సిగ్గు లేదా. మీ కోరికలు హద్దులు దాటుతున్నాయి. మీలాంటి వెధవలను అమ్మాయిలు ఎందుకు పట్టించుకుంటారు. అసలు అలా ఎలా ఆలోచిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎంతో మంది అమ్మాయిలు వేదింపులకు గురవుతున్నారు. సెక్స్ అనే విషయంలో అమ్మాయిలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. అమ్మాయిలను వర్జినిటీ ఎంత మందితో పోగొట్టుకున్నావని మాత్రమే అడుగుతారు. అబ్బాయిని ఆ విషయం ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ రష్మి సూటిగా ప్రశ్నిస్తోంది. ఇప్పటికే అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు చాలవన్నట్లుగా సోషల్ మీడియాలో కూడా ఈ వేదింపులు ఏంటీ అంటూ రష్మి ఆవేదన వ్యక్తం చేసింది. నిజంగా ఇలాంటి వాళ్ళను శిక్షించడానికి ఏదైనా చర్యలు చేపడితే బావుంటుందని రష్మి ఆవేదన చూసిన వాళ్ళు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: