టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయ ట్రాక్ త‌ప్పుతున్నాడా ?  రాంగ్ స్టెప్పుల‌తో మార్కెట్‌ను డౌన్ చేసుకుంటున్నాడా ? అంటే ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అవున‌నే ఆన్స‌ర్లే వినిపిస్తున్నాయి. 2017లో ప్రేమ‌తో మీ కార్తీక్ సినిమాతో ప‌రిచ‌యం అయిన కార్తీకేయ ఆ సినిమాతో ప్లాప్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత రెండో ప్ర‌య‌త్నంలో ఆర్‌ఎక్స్ 100తో ఒక్క‌సారిగా యూత్‌లో క్రేజీ హీరో అయిపోయాడు. అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏకంగా బ్లాక్‌బ‌స్ట‌రే అయ్యింది.


కార్తికేయకు హీరోగా మంచి గుర్తింపుతో పాటు భారీ వసూళ్లు కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మ‌నోడు క‌థ‌ల ఎంపిక‌లో కాస్త ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ల‌డంతో ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌లేదు. ఆర్ఎక్స్ 100 సినిమా త‌ర్వాత  నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడని ఊహించిన వారందరికీ 'హిప్పీ' అనే సినిమాతో షాక్ ఇచ్చాడు.
హిప్పీతో కార్తీకేయ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యింది. 


ఓ త‌మిళ ద‌ర్శ‌కుడిని ఎంపిక చేసుకుని, గుడ్డిగా న‌మ్మేసి చేసిన హిప్పీ డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు గుణ 369 సినిమాతో మ‌ళ్లీ త‌క్కువ టైంలోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.  ఓ స్ట్రాంగ్ మెసేజ్ తో వచ్చినప్పటీకీ ఆశించిన విజయం సాధించలేకపోయాడు. ఈ సినిమా విషయంలో మాత్రం కార్తికేయను తప్పుబట్టలేం. సినిమాలో హిట్టయ్యే కంటెంట్ ఉంది. కొన్ని లోపాల సినిమాకు ప్లాప్ చేసేశాయి.


అయితే బీ, సీ సెంట‌ర్ల‌లో ఈ సినిమా కొంత వ‌ర‌క క‌నెక్ట్ అయ్యింది. మొత్తం మూడు సినిమాలు చేస్తే ఒక‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే... రెండు ఫ‌ట్ మ‌న్నాయి. ఇక ఇప్పుడు నాలుగో సినిమాగా  '90 ఎం ఎల్' అనే మాస్ మసాలా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మ‌రి ఈ సినిమాతో అయినా త‌న‌కు వ‌చ్చిన ఇమేజ్‌ను కాపాడుకోలేక‌పోతే కార్తీకేయ మార్కెట్‌, క్రేజ్ మ‌రింత డౌన్ అవుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: