ఇటీవల 66వ జాతీయ పురస్కారాల అవార్డులను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మహానటి, రంగస్థలం, చిలసౌ, అ ! సినిమాలు వివిధ విభాగాలలో అవార్డులు దక్కించుకోవడం జరిగాయి. ఈ నేపథ్యంలో జాతీయ ఉత్తమ నటిగా మహానటి సినిమాలో సావిత్రి పాత్ర ధరించిన కీర్తి సురేష్ కి దక్కింది. దీంతో కీర్తి సురేష్ పేరు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ ఇండస్ట్రీ లో మారుమ్రోగుతోంది. దాదాపు 28 సంవత్సరాల తర్వాత అనగా అప్పట్లో విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా కి విజయశాంతికి జాతీయ ఉత్తమ నటి పురస్కారం రాజా తాజాగా ఆ తర్వాత కీర్తి సురేష్ కి ఈ అవార్డు దక్కడం విశేషం.


ఇటువంటి నేపథ్యంలో జాతీయ ఉత్తమ నటులుగా అంధాధూన్ చిత్రానికి ఆయుష్మాన్ ఖురానా, ఉరి చిత్రానికి విక్కీ కౌశల్ కు అవార్డు దక్కింది. కానీ మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అర్హుడనే వాయిస్ అంతకంతకు పెరుగుతోంది. రంగస్థలం చిత్రానికి బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో జాతీయ అవార్డు ఇచ్చి సరిపుచ్చారు. దీంతో చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్లు మెగా అభిమానులు జాతీయ ఉత్తమ నటుడుగా రామ్ చరణ్ కు అవార్డు ఇవ్వాలని ఆ అవార్డు కి అన్ని విధాలా చరణ్ అర్హుడని తెగ కామెంట్లు పెడుతున్నారు.


ఇటువంటి నేపథ్యంలో మంచు విష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. మంచు విష్ణు ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ.. 'జాతీయ అవార్డులు గెలుచున్న వారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు.. కానీ సోదరుడు రాంచరణ్ రంగస్థలం చిత్రంలో నటనకు ఉత్తమ నటుడిగా అన్ని విధాలా అర్హుడు. నా అభిప్రాయాన్ని నిజాయతీగా చెబుతున్నా.. రాంచరణ్ రంగస్థలంలో ఉత్తమ నటన కనబరిచాడు. ఇటీవల కాలంలో అలాంటి నటనని మరే నటుడిలోనూ చూడలేదు. రంగస్థలం చిత్రంపై ప్రేక్షకులు ప్రేమ చూపించి ఆల్రెడీ రాంచరణ్ కు అవార్డు ఇచ్చేశారు' అని విష్ణు ట్వీట్ చేశాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: