300 కోట్ల భారీ మూవీ ‘సాహో’ తో సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరిమట్ట’ పోటీ పడటం అత్యంత ఆశ్చర్యంగా మారింది. వాస్తవానికి సంపూ మూవీ నాగార్జున ‘మన్మధుడు 2’ అనసూయ ‘కథనం’ సినిమాలతో పోటీ పడుతూ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ఏకంగా ‘కొబ్బరిమట్ట’ ‘సాహో’ టీమ్ కు షాక్ ఇచ్చిన విషయం నిన్న జరిగింది. 

నిన్న ‘సాహో’ ట్రైలర్ విడుదలైన పరిస్థితులలో సోషల్ మీడియాలో చాలామంది ‘సాహో’ ట్రైలర్ గురించి ఎంతలా వెతికారో ‘కొబ్బరిమట్ట’ మూవీ టాక్ ఎలా ఉంది అన్న విషయమై కూడ అదే రేంజ్ లో సర్చ్ చేసారు. దీనితో ‘సాహో’ ట్రైలర్ తో పోటీ పడుతూ ‘కొబ్బరిమట్ట’ ట్రెండింగ్ లిస్టులోకి చేరిపోయింది. 

‘సాహో’ ట్రైలర్ డే హ్యాష్ ట్యాగ్ గూగుల్ సర్చ్ లో మొదటి స్థానంలో నిలిస్తే ‘కొబ్బరిమట్ట’ హ్యాష్ ట్యాగ్ మూడవ స్థానంలో నిలిచి అందర్నీ ఆశ్చర్య పరిచింది. దీనితో సంపూ మ్యానియా కేవలం నాగార్జునకు మాత్రమే కాకుండా ప్రభాస్ కు కూడ షాక్ ఇచ్చే స్థితికి చేరుకోవడం సంచలనంగా మారింది. 

ఇప్పటికే ఈ వీకెండ్ మూవీల రేసులో సంపూ సినిమాకు టోటల్ పాజిటివ్ టాక్ రావడమే కాకుండా ఈ సినిమాకు ధియేటర్స్ కూడ పెంచుతారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు బర్నింగ్ స్టార్ మ్యానియా ఊహించని విధంగా ‘సాహో’ తో కూడ పోటీ పడటం ఊహించని సంఘటన. వాస్తవానికి బడ్జెట్ పరంగా మాత్రమే కాకుండా విడుదల అవ్వడానికి అనేక సమస్యలు ఎదుర్కున్న ‘కొబ్బరిమట్ట’ ఇలా ఊహించని విజయం అందుకోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ సాధించిన ఊహించని విజయంతో సంపూ మళ్ళీ ట్రాక్ లోకి రావడమే కాకుండా మరికొన్ని అవకాశాలు అందుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: