కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో కాశ్మీర్ ప్రాంతం సంచలన వార్తలకు కేంద్ర బిందువుగా మారింది. భూతల స్వర్గంగా పేరు గాంచిన కాశ్మీర్ లో చాలకాలం తరువాత మన తెలుగు సినిమాల షూటింగ్ వరసగా జరిగాయి. 

వెంకటేష్ నాగచైతన్యల ‘వెంకీమామ’ ఆది సాయి కుమార్ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ మూవీలతో పాటు లేటెస్ట్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ షూటింగ్ కూడ కాశ్మీర్ లోయలో జరిగింది. ఆర్టికల్ 370 రద్దుకు కేవలం కొద్దిరోజుల ముందు ఈమూవీ షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన మహేష్ కాశ్మీర్ ప్రజల పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 

ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ కాశ్మీర్ ప్రజల మంచితనం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తాను ఇప్పటి వరకు బాలనటుడుగా హీరోగా అనేక సినిమాలలో నటించినా ఎప్పుడు కాశ్మీర్ వెళ్ళలేదనీ అయితే అనుకోకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం ధైర్యం చేసి కాశ్మీర్ వెళ్ళిన విషయాన్ని తెలియచేస్తూ కాశ్మీర్ ప్రజలు అందరితో చాల స్నేహంగా ఉంటారు అన్న తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 

అనవసరంగా అక్కడి ప్రజల పై అనేక అపోహలు ఉన్నాయని అయితే దానికి భిన్నంగా అక్కడి ప్రజలు తనకు సహకరించడమే కాకుండా తన కూతురు సితారను కూడ అక్కడి ప్రజలు ఎంతో ముద్దుగా చూసుకున్న విషయాన్ని బయటపెట్టాడు. భవిష్యత్ లో తాను నటించే ప్రతి సినిమా షూటింగ్ లో కొన్ని సన్నివేశాలు అయినా కాశ్మీర్ లో తీయమని తాను తన దర్శకులకు సలహా ఇస్తాను అంటూ మహేష్ కాశ్మీర్ పై తన ప్రేమను వ్యక్త పరుస్తున్నాడు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే కాబోలు ప్రధానమంత్రి మోడీ ఈమధ్య కాశ్మీర్ సమస్య పై మాట్లాడుతూ అక్కడి షూటింగ్ లు జరుపుకునే అన్ని తెలుగు సినిమాలకు భద్రత కలిపిస్తాము అంటూ ప్రకటన ఇచ్చి తెలుగు హీరోలకు జోష్ ను కలిగించారు..



మరింత సమాచారం తెలుసుకోండి: