ఇప్పటికే అందరికీ ఈ విషయం పై ఒక అవగాహన వచ్చుంటుంది. అవును నిన్న విడుదల అయిన జాతీయ అవార్డుల విషయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అన్యాయం జరిగింది అనే చెప్పాలి. 'రంగస్థలం' కు గాను చిట్టి బాబు గా నటించిన రామ్ చరణ్ చేసిన పర్ఫామెన్స్ తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే చరణ్ ను కాదని ఉత్తమ నటుడు అవార్డు బాలీవుడ్ కి చెందిన ఆయుష్మాన్ ఖురానా మరియు విక్కీ కౌశల్ ఎగరేసుకుని పోయారు.


'యురి అటాక్' మరియు ' అంధాదున్' చిత్ర లో వారు చేసిన పర్ఫామెన్స్ కన్నా చిట్టి బాబు గా చరణ్ మెరుగ్గానే చేశాడని చెప్పాలి. ఈ మూడు సినిమాలని పోల్చి చూసినా ఎవరైనా ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. చరణ్ నుంచి అసలు ఊహించిన పెర్ఫామెన్స్ ‘రంగస్థలం’లో చూశాం. చరణ్‌ను తీవ్రంగా వ్యతిరేకించేవాళ్లు కూడా ఈ సినిమా చూసి షాకయ్యారు. బహుశా ఇక భవిష్యత్తులో రామ్ చరణ్ నుండి ఈ రేంజ్ పర్ఫామెన్స్ చూడడం సాధ్యం కాకపోవచ్చు.


నేషనల్ అవార్డు కి ఇద్దరిని ఎంపిక చేసిన జ్యూరీ, ఎవరి నటన పట్ల పూర్తిగా సంతృప్తికరంగా లేకుంటే మెరుగైన వారికి ఇవ్వాల్సింది. ఆ విధంగా చూసుకున్నా నా రామ చరణ్ ఈ విషయంలో వారిద్దరి కన్నా పూర్తి అర్హుడే. కానీ చరణ్ చేసిన మాస్టర్ క్లాస్ పెర్ఫార్మెన్స్ ను కాదని ఒకే అవార్డును ఇద్దరి మధ్య పంచడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇలా జరగడం మెగా పవర్ స్టార్ కు మొదటిసారి ఏమి కాదు.


ఇంతకుముందు నంది అవార్డుల విషయంలో కూడా చరణ్ కి ఇలాగే జరిగింది. తెలుగు సినిమా పరిశ్రమ రేంజ్ ను ఒక మెట్టు ఎక్కించిన 'మగధీర' ఈ చిత్రంలో రామ్ చరణ్ ను కాదని 'మేస్త్రీ' సినిమాకు గాను ఉద్దేశపూర్వకంగానే దాసరి నారాయణ రావు గారికి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు జాతీయ అవార్డుల విషయంలో కూడా చరణ్ కు ఇదే విధంగా జరగడం చూస్తే 'చేతికి అందింది నోటికి అందలేదు' అన్న సామెత చరణ్ కు బాగా సరిపోతుంది అనుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: