సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2005 లో రిలీజయిన అతడు సినిమా అప్పట్లో పెద్ద ప్రభంజనాన్ని సృష్టించి సిల్వర్ జూబిలీ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇక ఈ సినిమా లోని సాంగ్స్, ఫైట్స్ అలానే మరీ ముఖ్యంగా డైలాగ్స్ మరియు ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరనే చెప్పాలి. ఇక ఈ సినిమాను స్టార్ మా ఛానల్ లో పలు మార్లు ప్రదర్శించినప్పటికీ కూడా రేటింగ్స్ బాగా వస్తుండడంతో, 

ఆ ఛానల్ వారే ఎప్పటికపుడు ప్రతిఏడాది ఆ సినిమాను కొనుగోలు చేసి ప్రసారం చేస్తున్నారు. ఇకపోతే ఈ సూపర్ హిట్ సినిమా రిలీజయి నిన్నటితో 14 ఏళ్ళు గడవడంతో సూపర్ స్టార్  మహేష్ ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా వేదికల్లో సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి అంతకముందు నాని, అర్జున్ వంటి అపజయాలతో కొంత ఢీలాపడ్డ మహేష్ కెరీర్ కు అతడు సినిమా అతి పెద్ద బ్రేక్ ని ఇచ్చింది. అంతకముందు తరుణ్, శ్రియల కలయికలో నువ్వే నువ్వే వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో తొలి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ కు ఇది రెండవ సినిమా కావడం, 

అలానే ఈ సినిమా అద్భుత విజయంతో ఆయన ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించడం జరిగింది. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ పై నిర్మితం అయిన ఈ సినిమాకు స్వర బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చగా, ప్రముఖ ఛాయాగ్రాహఖులు కెవి గుహన్ ఫోటోగ్రఫీ ని అందించడం జరిగింది. ఈ సినిమా అద్భుత విజయం తరువాత మహేష్ తో పాటు త్రివిక్రమ్ కు కూడా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఒక గమ్మత్తయిన విషయం ఏమిటంటే, త్రివిక్రమ్ కెరీర్ లో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఆయన ఫ్యాన్స్ మాత్రం మహేష్ తో తెరకెక్కించిన ఈ సినిమాకె ఎక్కువ శాతం  ఓటేయడం గమనర్హం.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: