టాలీవుడ్ యూత్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్. బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న విజయ్ సరసన జోడి కట్టిన ఈ సినిమా, మంచి క్రేజ్ తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. హృద్యమైన ప్రేమకథతో పాటు నేటి సమాజానికి మేలు చేకూర్చే ఒక మంచి అంశాన్ని సినిమా కథలో మిళితం చేసి తెరకెక్కించిన దర్శకుడు, దానిని ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. 

మొదటి రోజు కాస్త మిక్స్డ్ టాక్ తో మొదలైన ఈ సినిమా, రోజురోజుకు మరింతగా జోరును తగ్గిస్తూ ముందుకు సాగింది. సినిమాలో విజయ్ ట్రెమండస్ పెర్ఫార్మన్స్, మరియు స్క్రీన్ పై విజయ్, రష్మిక ల జోడి అదరకొట్టినప్పటికీ, సినిమాలో పాటలు అంతగా ఆకట్టుకోకపోవడం, అలానే ఎక్కువశాతంగా సాగతీతగా సాగిన ఈ సినిమాకు లెంగ్త్ కూడా సక్సెస్ కు మరొక అడ్డంకిగా మారినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. ఇకపోతే ఈ సినిమా పరిస్థితి నిన్నటితో ఆల్మోస్ట్ చాలా సెంటర్స్ లో పూర్తిగా క్లోజ్ అయినట్లేనని, 

ఇప్పటివరకు ఈ సినిమా కేవలం రూ.21.50 కోట్లనే రాబట్ట గలిగిందని, వాస్తవానికి ఈ సినిమాకు రూ. 34.60 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అంటే వారు చెప్తున్న లెక్కల ప్రకారం, ఈ సినిమా దాదాపుగా రూ.13 కోట్ల పైచిలుకు నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన ట్రైలర్ మరియు సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి, యూత్ లో మంచి క్రేజ్ సంపాదించడం, అలానే విజయ్, రష్మికలకు కు కూడా మంచి ఫాలోయింగ్ ఉండడంతో, ఓపెనింగ్స్ బాగా రావడం జరిగిందని, అయితే ప్రేక్షకులు అనుకున్న అంచనాలకు కొంతవరకు అయినా సినిమా రీచ్ అయి ఉన్నట్లయితే, ఈ పాటికే డియర్ కామ్రేడ్ లాభాల బాటలో నడిచి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!    


మరింత సమాచారం తెలుసుకోండి: