సినిమాల్లో పాపులారిటీ చాలా ముఖ్యం. పాపులారిటీ సంపాదించాక ఎవరి సినిమానైనా ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు. కొందరు బ్యాక్ గ్రౌండ్ తో పాపులర్ అయితే మరికొందరు కష్టపడి, ఇంకొందరు తమ టాలెంట్ తో పాపులారిటీ సంపాదిస్తారు. అలాంటి కోవలోకి వచ్చే హీరో సంపూర్ణేష్ బాబు. సోషల్ మీడియాలో తనకు తానుగా బర్నింగ్ స్టార్ అంటూ ప్రమోట్ చేసుకుని హృదయకాలేయంతో అనే సినిమాతో హిట్ కొట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు.

 


కొంత గ్యాప్ తర్వాత సంపూ నటించిన కొబ్బరిమట్ట సినిమా ఈ శనివారం రిలీజ్ అయింది. మార్నింగ్ షో నుంచే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చేసింది. టీజర్లో 3నిమిషాల 28 సెకన్ల డైలాగ్ తోనే అందరినీ ఆకట్టుకున్న సంపూ తనదైన కామెడీతో సినిమాను హిట్ చేసుకున్నాడు. విశేషమేమిటంటే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మొదటి రోజు కలెక్షన్లలో బాలకృష్ణ, నాగార్జునల సినిమాలను దాటేసి రికార్డ్ సృష్టించాడు సంపూ. సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ ఎన్టీఆర్ మహానాయకుడు మొదటి రోజు 1లక్ష 60వేలు, నాగార్జున లేటెస్ట్ రిలీజ్ మన్మథుడు2 మొదటి రోజు 2లక్షల 80వేల గ్రాస్ ను.. కొబ్బరిమట్టతో 2లక్షల 88వేల గ్రాస్ సాధించి ఇద్దరు సూపర్ స్టార్లను క్రాస్ చేసి సంచలనమే నమోదు చేశాడు సంపూ. ఇప్పటికే హిట్ టాక్ రావడంతో ఈ సినిమా వీకెండ్స్ లో మరిన్ని కలెక్షన్లు రాబట్టటం ఖాయమంటున్నారు.

 


మొదటి సినిమా హృదయకాలేయం సినిమా అప్పట్లో ఓ మినీ సంచలనం. హైదరాబాద్ లో ఆ సినిమా మొదటి షో అన్ని సెంటర్లలో ఫుల్ అయి ఆశ్చర్యపరచింది. సంపూర్ణేష్ సినిమా అంటే డిఫరెంట్ కామెడీ ఉంటుందనే ఫీల్ కి జనాలు వచ్చేశారు. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను స్టీవెన్ శంకర్ నిర్మించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: