టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన మ‌న్మ‌థుడు 2 భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌న్మ‌థుడు బ్రాండ్ నేమ్‌తో హంగామా చేయ‌డంతో ఈసినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఒక్క రోజు తేడాలో శ‌నివారం సంపూర్ణేష్ బాబు న‌టించిన కొబ్బ‌రిమ‌ట్ట సినిమా కూడా వ‌చ్చింది. ఈ రెండు సినిమాల‌ను కంపేరిజ‌న్ చేసి చూస్తే ఎవ‌రైనా ఖ‌చ్చితంగా కొబ్బ‌రిమ‌ట్ట నాగ్ సినిమాకు ఏ మాత్రం పోటీ ఇవ్వ‌ద‌ని అనుకుంటారు. 


మ‌న్మ‌థుడు 2 వ‌సూళ్ల‌కు కొబ్బ‌రిమ‌ట్ట వ‌సూళ్లు ద‌రిదాపుల్లో కూడా ఉండ‌వ‌నే అనుకుంటారు. అయితే అంద‌రి అంచ‌నాల‌కు భిన్నంగా సంపూ కొబ్బ‌రిమ‌ట్ట‌తో నాగ్ మ‌న్మ‌థుడు 2కు దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చాడు. హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శ‌నివారం నాగ్ మ‌న్మ‌థుడు-2 కంటే సంపూ సినిమా కొబ్బ‌రిమ‌ట్ట‌కే ఎక్కువ వ‌సూళ్లు వ‌చ్చాయి. వెరీ డిజాస్ట‌ర్ టాక్ రావ‌డం కూడా మ‌న్మ‌థుడు 2 సినిమా వ‌సూళ్ల‌పై గ‌ట్టిగానే ఎఫెక్ట్ ప‌డింది. 


శుక్ర‌వారం మార్నింగ్ షో వ‌దిలేస్తే ఏ షో కూడా మ‌న్మ‌థుడు 2కు హైదారాబాద్‌లోని శాంతి థియేట‌ర్లో హౌస్‌ఫుల్ కాలేద‌ట‌. ట్విస్ట్ ఏంటంటే ఆ థియేట‌ర్ కెపాసిటీ అక్క‌డే ఉన్న మిగిలిన పెద్ద థియేట‌ర్ల‌తో పోలిస్తే త‌క్కువే అయినా ఒక్క మార్నింగ్ షో ఒక్క‌టే హౌస్‌ఫుల్ అయ్యింది. శాంతితో పోలిస్తే చాలా పెద్ద థియేట‌ర్ అయిన సంధ్య 70 ఎంఎంలో కొబ్బ‌రిమ‌ట్టకు ఏకంగా 1.14 ల‌క్ష‌ల గ్రాస్ వ‌చ్చింది. అదే టైంలో మ‌న్మ‌థుడు షోకు కేవ‌లం 70 వేల గ్రాస్ వ‌చ్చింది.


శ‌నివారం మొత్తం నాలుగు షోల‌కు క‌లిపి కొబ్బ‌రిమ‌ట్ట 2.88 ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూలు చేస్తే... నాగ్ మ‌న్మ‌థుడు 2 శ‌నివారం నాలుగు షోల‌కు క‌లిపి కేవ‌లం 1.93 ల‌క్ష‌లే వ‌సూలు చేసింది. పోనీ మ‌న్మ‌థుడు తొలి రోజు అయినా కొబ్బ‌రిమ‌ట్ట తొలి రోజు కంటే ఎక్కువ వ‌సూలు చేసిందా ? అంటే అదీ లేద. కొబ్బ‌రిమ‌ట్ట తొలి రోజు రూ 2.88 ల‌క్ష‌లు రాబ‌డితే, మ‌న్మ‌థుడు 2కు వ‌చ్చిన గ్రాస్ 2.83 ల‌క్ష‌లే. ఏదేమైనా నాగార్జున ప‌రువును ఆఫీసర్ ఎంత ప‌త‌నం చేసిందో మ‌న్మ‌థుడు 2 అంత‌కు మించి దిగ‌జార్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: