టాప్  హీరోయిన్ సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్  చిత్రం ఓ బేబీ.  ఇటీవల విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన  రివ్యూస్ తో అలాగే సూపర్ పాజిటివ్ మౌత్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అయ్యింది.  ఫుల్ రన్ లో ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా  18కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిందని సమాచారం.  ఇక  ఈ చిత్రం అటు  ఓవర్సీస్ లోనూ సూపర్ హిట్ అయ్యింది.  1.2 మిలియన్ డాలర్ల గ్రాస్  వసూళ్లను రాబట్టి   భాగమతి ,మహానటి  సినిమాల తరువాత  యూఎస్ లో మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టిన మూడవ చిత్రం గా ఓ బేబీ  రికార్డు సృష్టించింది. 


కొరియన్ మూవీ మిస్ గ్రానీ కి రీమేక్ గా తెరకెక్కిన  ఈచిత్రానికి  'అలా మొదలైంది'  ఫేమ్ నందిని రెడ్డి  దర్శకత్వం వహించగా ఈ చిత్రంలో  సీనియర్ నటి లక్ష్మి , రావు రమేష్ , రాజేంద్ర ప్రసాద్ ,నాగ శౌర్య , తేజ ముఖ్య పాత్రల్లో నటించారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. కాగా ఈ సినిమా కోలీవుడ్ లోకి వెళుతుంది.   ఆగస్టు 15 న ఈ చిత్రం యొక్క  తమిళ వెర్షన్ అక్కడ విడుదలకానుంది.  కాగా  తమిళ్ లో సమంత కు మంచి ఫాలోయింగ్ వుంది.  ఇక సమంత ప్రస్తుతం కోలీవుడ్  సూపర్ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ లో నటిస్తుంది.  ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించి ప్రేమ్ కుమార్  ఈరీమేక్ కు దర్శకుడు కాగా  శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. కాగా సమంత చేతిలో ప్రస్తుతం ఈ ఒక్క సినిమా మాత్రమే వుంది.  ఇంకా కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: