కేవ‌లం టాలీవుడ్ ప్రేక్షకులే కాదు యావత్ భారతదేశ మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న సాహో ఈ నెల 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏకంగా నాలుగు భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన ఈ హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌భాస్ స‌న్నిహితులు అయిన వంశీ - ప్ర‌మోద్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. ర‌న్ రాజా ర‌న్ డైరెక్ట‌ర్ సుజీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.


తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్ దేశ‌వ్యాప్తంగా కేవ‌లం 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌కుండానే బాహుబ‌లి ట్రైల‌ర్ రికార్డుల‌కు పాత‌రేస్తూ యూ ట్యూబ్‌లో వీరంగం ఆడుతూ దూసుకుపోతోంది. బాహుబలి తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఈ సినిమాతో ఇప్ప‌టి వ‌రకు ఇండియ‌న్ సినిమా స్క్రీన్‌పై చూడ‌ని యాక్ష‌న్ ఫీస్ట్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నాడు. 


లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం సాహో రన్ టైం లాక్ అయ్యింద‌ట‌. మొత్తం 2 గంటల 52 నిమిషాల పాటు సాహో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతుందన్న మాట. అంటే మొత్తం 172 నిమిషాల పాటు ఈ సినిమా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ 1 గంట 24 నిముషాలు రాగా సెకండ్ హాఫ్ దానికంటే ఎక్కువగా 1 గంట 28 నిముషాలు తేలిందట. అంటే మూడు గంట‌ల‌కు ఓ 8 నిమిషాలు త‌క్కువుగా ఉండేలా ర‌న్ టైం లాక్ చేసిన‌ట్టు తెలుస్తోంది. 


ఇటీవ‌ల తెలుగు సినిమాలు బాహుబ‌లి, రంగ‌స్థ‌లం, మ‌హ‌ర్షి సినిమాల ర‌న్ టైం కూడా మూడు గంట‌ల‌కు కాస్త త‌క్కువ‌గానే ఉన్నా...ఆ సినిమాల్లో కంటెంట్ ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్లో కూర్చోపెట్ట‌డంతో అవి హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు సాహో అవుట్ ఫుట్ చూసిన నిర్మాత‌లు ర‌న్ టైం విష‌యంలో ఏ మాత్రం ఆందోళ‌న చెంద‌డం లేద‌ని తెలుస్తోంది. సాహోలో కావాల్సిన‌న్ని మ‌లుపులు ఉంటాయ‌ట‌. 


ప్ర‌తి మలుపులోనూ ఉత్కంఠ కలిగించే ఛేజులు ఫైట్లు ఎన్నెన్నో ఉంటాయి. ఇక ద‌ర్శ‌కుడు అంత సేపు ప్రేక్ష‌కుడిని కుర్చీలో కూర్చోపెట్టేలా ?  ఎలా టైట్‌గా స్క్రీన్ ప్లే రాసుకున్నాడో ?  అన్న‌తే ఉత్కంఠ‌గా మారింది. ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్ న‌టిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: