Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 8:08 pm IST

Menu &Sections

Search

మన్మథుడు 2.. పాపం ఇంకా నాగ్ ఆశలు చావలేదు గా...

మన్మథుడు 2.. పాపం ఇంకా నాగ్ ఆశలు చావలేదు గా...
మన్మథుడు 2.. పాపం ఇంకా నాగ్ ఆశలు చావలేదు గా...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కింగ్‌నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రూపొందిన చిత్రం 'మన్మథుడు 2'. నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌(జెమిని కిరణ్‌) నిర్మాతలు. ఆగస్ట్‌ 9న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన సక్సెస్‌మీట్‌లో ...


అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ``అప్పుడు ఎప్పుడో తెలుగు సినిమాలకు 8 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. తర్వాత అవార్డులు రావడం తగ్గిపోయాయి. ఇప్పుడు 7 అవార్డులు వచ్చింది. అందులో రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన `చి.ల.సౌ`కు అవార్డ్ రావడం.. ఆ సినిమా నిర్మాతల్లో నేను ఒకడిని కావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. `మహానటి` సినిమాలో కీర్తిసురేశ్‌కి ఉత్తమనటి అవార్డు వచ్చింది. అలాగే `రంగస్థలం`, `అ!`, `చి.ల.సౌ` సినిమాలకు అవార్డులు వచ్చాయి. నేను ఎప్పుడూ నా కెరీర్‌లో కొత్తదనం చూపించాలనుకున్నాను. చేస్తూ వచ్చాను. ఒకే టైప్ సినిమాలు చేస్తున్నప్పుడు నాకు నచ్చట్లేదు, అలాగే యూత్‌కి కూడా నచ్చడం లేదని ఏదో చేయాలని `గీతాంజలి` సినిమా చేశాను. ఫస్ట్ టైమ్ రెగ్యులర్ సినిమాకు భిన్నంగా ఆ సినిమా చేశాను. ఇప్పుడు ఆ సినిమా కల్ట్ క్లాసిక్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా యాక్సెప్ట్ చేయడానికి చాలా సమయం పట్టింది. 1988లో డిజిటల్ లేకపోవడం వల్ల ఫోన్‌లో చెబితే అక్కడిక్కడే ఎడిటింగ్ చేసేవాళ్లు. సీడెడ్‌లో అయితే గీతాంజలి సినిమా జగడజగడ.. పాట నుండి స్టార్ట్ అవుతుంది. అదేంటని అడిగితే హీరోకి క్యాన్సర్ అని ముందే తెలిస్తే సినిమా డల్ అయిపోతుందని వాళ్లే నిర్ణయించుకుని ఎడిట్ చేశారు. దాన్ని తర్వాత ఎక్కడో యాడ్ చేసుకున్నారు. కానీ ఫైనల్లీ ఆ సినిమాను వారం తర్వాత అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు. నా బెస్ట్ మూవీస్‌లో `గీతాంజలి`ని కల్ట్ క్లాసిక్ అంటుంటారు. శివ అయిన తర్వాత నిర్ణయం చేశాను. ఇప్పుడు నిర్ణయం చిత్రాన్ని మంచి సినిమా అంటారు. కానీ సినిమాకు మేం పడ్డ తిప్పలు మాకే తెలుసు. ఇలా చాలా సినిమాలున్నాయి. అవేంటో మీకు కూడా తెలుసు. అన్నమయ్య సినిమా 8వ రోజు కలెక్షన్స్ రెంట్స్ కూడా కట్టలేని పరిస్థితికి చేరుకున్నాయి. నేను, రాఘవేంద్రరావు, దొరస్వామిరాజుగారు చాలా బాధపడ్డాం. చాలా మంచి సినిమా చేశామనుకున్నాం. అప్పుడు ఓ టూర్ వెళ్లినా కూడా వర్కవుట్ కాలేదు. అయితే 11వ రోజు.. ఏం జరిగిందో ఏమో కానీ.. మ్యాట్నీ నుండి అన్ని థియేటర్స్ హౌస్‌ఫుల్స్ అయ్యాయి. ఆ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో అందరికీ తెలుసు. నాకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అలాగని ఇప్పుడు నేను ఆ సినిమాలతో `మన్మథుడు 2`ని పోల్చాలని అనుకోవడం లేదు. `మన్మథుడు` కూడా విడుదలైనప్పుడు డైరెక్టర్ విజయ్ భాస్కర్ వచ్చి.. ఎక్కడో తప్పు చేశాం సార్! అని అన్నారు. ఏం లేదండి.. కొత్త రకమైన సినిమా.. కొత్త డైలాగ్స్.. టైం పడుతుందని చెప్పాను. తర్వాత ఆ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించింతో తెలిసిందే. నాలో కొత్తదనం చూసుకోవాలి అని ఆలోచించి `మన్మథుడు 2` చేశాను. నేను ఎక్స్‌పెరిమెంట్స్ చేసే ఇక్కడి వరకు వచ్చాను. మన్మథుడు 2కూడా అలాగే చేశాం. అయితే దీన్ని వెంటనే యాక్సెప్ట్ చేయలేరు. కాస్త సమయం తీసుకుంటుంది. కలెక్షన్స్ చూసి చాలా సంతోషమేసింది. అందరూ ఫోన్స్ చేసి అభినందిస్తున్నారు. ఒక పక్క బిగ్‌బాస్ సంతోషం.. మరో పక్క ఇదొక సంతోషం. తల్లికొడుకుల మధ్య అనుబంధం, తల్లి పడే తాపత్రయం, నాకు, వెన్నెల కిషోర్ మధ్య ఉండే కామెడీ.. అన్ని ప్రేక్షకులకు నచ్చుతాయి. కలెక్షన్స్ బావుంటేనే నిర్మాత మరో సినిమా తీయగలుగుతాడు. `ఆర్.ఎక్స్ 100` సినిమాలో సాంగ్స్ చూసి నచ్చి చైతన్‌ని పిలిచి మ్యూజిక్ చేయమని అన్నాను. తను అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. రెండు సాంగ్స్ ట్రెండింగ్‌లో కూడా ఉన్నాయి. `నిన్నేపెళ్ళాడతా` తర్వాత లక్ష్మిగారితో నటించాలని అనుకున్నాను. అయితే ఆమెకు సూట్ అయ్యే రోల్ దొరకలేదు. ఈ సినిమాలో మళ్లీ ఆమెతో నటించే అవకాశం దక్కింది. చాలా హుందాగా నటించారు. ఝాన్సీ, దేవదర్శిని, నిశాంతి, కిట్టు చక్కగా నటించారు. నాకు, వెన్నెలకిషోర్ మధ్య కామెడీ ట్రాక్ అద్భుతంగా కుదిరింది. అలాగే రావు రమేశ్‌గారు నా మావయ్య పాత్రలో నటించారు. రకుల్ ఎక్సలెంట్. చాలా పర్‌ఫెక్ట్‌గా నటించింది`` అన్నారు. 


దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ - ``ఫస్ట్ డే ఉన్న టెన్షన్ నాకే తెలుసు. థియేటర్స్‌కి వెళ్లి అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందో చెప్పమని నాగార్జునగారు చెప్పమన్నారు. నేను నా టీమ్‌తో వెళ్లి చూశాను. ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాగ్‌సార్, వెన్నెల కిషోర్ కామెడీ, అవంతిక క్యారెక్టర్ నచ్చేసింది అందరూ క్లాప్స్ కొడుతున్నారు. క్లైమాక్స్‌ని సైలెంట్‌గా చూసి ఓ స్మైలింగ్‌తో బయటకు వచ్చారు`` అన్నారు. 


nagarjuna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మంచుల‌క్ష్మి కొత్త‌షో కోసం స్టార్స్‌ని నైట్‌డ్ర‌స్‌లో ర‌మ్మంటుందా...?
కాంగ్రెస్‌లో రేవంత్ తిరుగుబాటు? ఫ‌్యూచ‌ర్ ఏంటి?
ద‌ర్శ‌కుడు రైతుగా అవ‌తార‌మెత్తాడా..
మ‌రోసారి ‘ఫిదా’చేస్తారా...?
డైటింగ్ అంటే ఏంటి అంటుంది ర‌కుల్‌
హిందీ సాధ్యం కాదంటున్న త‌లైవా
టి. సుబ్బిరామిరెడ్డి పుట్టిన‌రోజున‌ జ‌య‌సుధ‌కు మంచి గిఫ్ట్‌
చిరు బ‌యోపిక్‌లో రామ‌చ‌ర‌ణా..? వ‌రుణ్‌తేజా..?
చంద‌మామ తాజ్ మ‌హ‌ల్‌కి వెళ్ళిందా... ఎందుకు?
రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైలులో క‌మ‌ల్‌హాస‌న్‌....?
శోభ‌న్‌బాబు షూతో వ‌రుణ్ డ్యాన్స్‌
'దేవత'చిత్రంతో 'వాల్మీకి' ని పోల్చిన ద‌ర్శ‌కుడు
చ‌ల‌ప‌తిరావుకి ఒక దశలో చచ్చిపోవాలనిపించిందంట‌...?
బిందెలిచ్చిన ప్రొడ్యూస‌ర్‌కి కృత‌జ్ఞ‌త‌లు అంటున్న హీరోయిన్‌
రానాతో వ‌ద్దంటున్న కీర్తి సురేష్‌
ఊరంతా అనుకుంటున్నారు ‘శతమానం భవతి’ లా హిట్ అవుద్దా...?
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సినిమా ప్రొడ్యూస‌ర్‌తో ప‌నేంటి...?
హీరో శ్రీ‌కాంత్ కి డ‌స్ట‌ర్‌1212 కి సంబంధం ఏమిటి...?
విజ‌య్ దేవ‌ర‌కొండ‌ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`
సన్‌స్ట్రోక్స్‌తో ఉరికొయ్యలపై జీవితాలు
సందీప్ హ‌న్సిక‌ను అలా అనేశాడేంటి...?
ఏ క‌థ‌లోనూ ఒరిజినాలిటీ లేదు అన్నీ రీమేక్‌లే
పాయల్ ల‌వ్ కి ముహూర్తం ఖ‌రారు
నాలుగు నిముషాలకు నాలుగు కోట్లు
మూడ‌వ‌గ‌ది అస‌లు క‌థ ఇదా...?
సైరా గురించి మ‌రో షాకింగ్ అప్‌డేట్‌
కోడెల మరణం : ప‌ల్నాటి పులిని పిల్లిని చేసిందెవరు ?
ప‌ల్నాటి పులిగా పేరొందిన కోడెల‌
బాల‌య్య ప‌వ‌ర్‌ను మ‌రోసారి చూపిస్తానంటున్న బోయ‌పాటి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు డా. రాజశేఖర్ ఇంత‌ విరాళం ఇచ్చారా...?
‘దామిని విల్లా’ లో దాగున్న రాహ‌స్య‌మేంటో
INDIA HERALD EXCLUSIVE: ఎన్టీఆర్ ఆయ‌న ద‌గ్గ‌ర రూ.5000 ఎందుకు అప్పు తీసుకున్నారు?
విల‌న్‌తో కూడిన హీరోగా చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది-శ్రీ‌కాంత్‌
రోడ్డు ప్ర‌యాణంలో 'ఒక చిన్న విరామం'
క్రీడాకారుడి పాత్ర‌లో సుధీర్ మెప్పించ‌గ‌ల‌డా...?
ఆయ‌న కంటిచూపుకు అంత ప‌వ‌ర్ ఉంటుందంటున్న ముద్దుగుమ్మ‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.